2500 థియేటర్స్ లో స్పైడర్?

  • IndiaGlitz, [Tuesday,September 26 2017]

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు, సూప‌ర్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న స్పై థ్రిల్ల‌ర్ స్పైడ‌ర్‌. తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో ఈ నెల 27న ఈ సినిమా విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. రెండు భాష‌ల్లో ఈ సినిమాని 2500 థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌బోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. భారీ స్థాయిలో విడుద‌ల కాబోతున్న ఈ సినిమాపై రెండు భాష‌ల్లోనూ మంచి అంచ‌నాలున్నాయి.

145 నిమిషాల పాటు సాగే ఈ సినిమా ఫ‌స్టాఫ్ లో ఫ‌న్‌, ల‌వ్ ట్రాక్ హైలెట్‌గా నిలిస్తే.. సెకండాఫ్‌లో ఎమోష‌నల్ కంటెంట్ ఎస్సెట్ గా నిలుస్తుంద‌ని త‌మిళ నాట వార్త‌లు వినిపిస్తున్నాయి. ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాలో ప్రముఖ ద‌ర్శ‌కుడు ఎస్‌.జె.సూర్య విల‌న్‌గా న‌టిస్తున్నాడు. హేరిస్ జైరాజ్ సంగీత‌మందించారు.