'స్పైడర్ ' టీజర్ ఎప్పుడంటే...
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న స్పై థ్రిల్లర్ `స్పైడర్`. ప్రస్తుతం రెండు సాంగ్స్ మినహా సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. గ్రాఫిక్స్ వర్క్ జరగాల్సి ఉంది.
గ్రాఫిక్ వర్క్ ను కూడా పూర్తి చేసి సినిమాను తెలుగు, తమిళంలో సెప్టెంబర్‌లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ లుక్, మోషన్ పోస్టర్‌కు ఆడియెన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే టీజర్ మాత్రం అప్పుడో ఇప్పుడో అంటూ వాయిదా వేస్తూ వచ్చారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టీజర్‌ను సూపర్‌స్టార్ మహేష్ తండ్రి సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఈ టీజర్ నిడివి 59 సెకన్ల పాటు ఉంటుందని, దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ పక్కా ప్లానింగ్‌తో సినిమాపై అంచనాలు పెరిగేలా టీజర్‌ను క్ట్ చేశాడని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com