ఐదు గంటల్లోనే రెండు మిలియన్ వ్యూస్ రాబట్టుకున్న'స్పైడర్'
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా ఎల్ఎల్పి బ్యానర్‌పై ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'స్పైడర్`. ఈ చిత్రం టీజర్‌ను ఈరోజు విడుదల చేశారు. సూపర్‌స్టార్ మహేష్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో తొలిసారి రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియెన్స్‌లో భారీ క్రేజ్ నెలకొంది.
ఈ టీజర్ విడుదలైన 5 గంటల్లోనే 2 మిలియన్ వ్యూస్‌ని 'స్పైడర్' టీజర్ క్రాస్ చేసిందంటే ఈ సినిమాపై ఉన్న అంచనాలను అర్థం చేసుకోవచ్చు. తెలుగు, తమిళ భాషల్లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments