'స్పైడర్ ' లో ఆడియెన్స్ కోరుకునే ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి - సూపర్ స్టార్ మహేష్
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా, రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'స్పైడర్'. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా ఎల్‌ఎల్‌పి పతాకంపై ఎన్.వి.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...
సూపర్‌స్టార్ మహేష్ మాట్లాడుతూ - ``యు.ఎస్‌లో కొన్ని గంటల్లో ప్రీమియర్ షోస్ స్టార్ట్ కాబోతున్నాయి. యు.ఎస్‌లో నంబర్స్ చూస్తుంటే త్వచాలా గర్వంగా ఉంది. నా సినిమాల్లో దేనికీ ఇంత బజ్ క్రియేట్ కాలేదు. చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. ప్రతి దర్శకుడు మహేష్‌తో కనీసం ఒక సినిమా అయినా చేయాలని మురుగదాస్ అనడం ఇప్పటి వరకు నేను అందుకున్న కాంప్లిమెంట్స్‌లో బిగ్గెస్ట్ కాంప్లిమెంట్‌గా భావిస్తున్నాను. మురుగదాస్‌గారితో సినిమా చేయడం మెమొరబుల్ ఎక్స్‌పీరియెన్స్. తెలుగు, తమిళంలో చేసిన సినిమా. రెండు భాషల్లో సినిమా చేయడం చాలా కష్టమనిపించింది. ఇలాంటి ఎక్స్‌పీరియెన్స్ రేర్‌గా వస్తుంటుంది. మురుగదాస్‌గారితో పనిచేయడం ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. ఆయనతో చేసిన జర్నీమరచిపోలేను. సాధారణంగా మురుగదాస్‌గారి సినిమాలు రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి సోషల్ మెసేజ్‌తో సినిమా ఉంటే, మరో విధానంలో స్టైలిష్‌గా యాక్షన్ సినిమాలను చేస్తారు. స్పైడర్ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్. బ్యాక్ లేయర్‌లో మెసేజ్ కూడా ఉంటుంది. హీరో ఐబి ఆఫీస్‌లో పనిచేసే వ్యక్తి. హీరో, విలన్ మధ్య పోటాపోటీగా సాగే మైండ్ గేమ్ మూవీ. టెరిఫిక్ స్క్రీన్‌ప్లే, స్టన్నింగ్ విజువల్స్ ఉంటాయి. ఆడియెన్స్‌కు ఏం కావాలో అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి. సినిమాలో చాలా సర్‌ప్రైజస్ ఉన్నాయి. అవన్నీ థియేటర్‌లో చూడాల్సిందే.
ఇది జేమ్స్ బాండ్ మూవీ కాదు, స్పై థ్రిల్లర్ మూవీ. బిగ్ బడ్జెట్ మూవీ. రెండు లాంగ్వేజస్‌లో చేస్తేనే ఆ బడ్జెట్ రికవరీ ఉంటుందని భావించి రెండు లాంగ్వేజెస్‌లో చేశాం. నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇది. నా స్కూల్, కాలేజ్, ఫ్రెండ్స్ అంతా చెన్నైలోనే. సడెన్‌గా చెన్నై వదిలేసి, హైదరాబాద్ వచ్చి యాక్టింగ్ కెరీర్‌లో పడిపోయాను. ఇక్కడ ప్రపంచంలోనే బ్రతికాను. తమిళంలో సినిమా చేద్దామని ఎవరూ మమ్మల్ని అప్రోచ్ కాలేదు. 18 ఏళ్ల తర్వాత మురుగదాస్‌గారు కథ చెప్పడం, నచ్చడం సినిమా చేయడం చక చకా జరిగిపోయాయి. తమిళ సినీ వర్గాలు రిసీవ్ చేసుకున్న తీరు అద్భుతం. ఆ ఫీలింగ్‌ను నేను మాటల్లో చెప్పలేను. ఓ రకంగా చెప్పాలంటే కళ్లల్లో నీళ్లు కూడా తిరిగాయి. తమిళంలో లాంచ్ కావడం ఓ క్యూరియాసిటీని కలిగించింది. ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాను. అద్భుతమైన యాక్షన్ సీన్స్ ఉంటాయి. పీటర్ మా సినిమా కోసం వర్క్ చేస్తున్నప్పుడు తనకు పులిమురుగన్ సినిమా కోసం నేషనల్ అవార్డు వచ్చింది. స్పైడర్ తరపున వచ్చే ఏడాది కూడా పీటర్‌కు నేషనల్ అవార్డ్ వస్తుంది`` అన్నారు.
ఎ.ఆర్.మురుగదాస్ మాట్లాడుతూ - ``మహేష్‌బాబుగారి ఇమేజ్‌కు తగినట్టు తెలుగు, తమిళంలో కథను బేలన్స్‌ను చేస్తూ చేసిన సినిమా`` అన్నారు.
రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ - ``తమిళంలో అల్రెడి నేను సినిమా చేశాను. స్పైడర్ నాకు కమ్ బ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. మంచి టీంతో పనిచేయడం మరచిపోలేని అనుభవం. మహేష్‌తో పనిచేయడం గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్. మహేష్ డైరెక్టర్స్ యాక్టర్స్. సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాను`` అన్నారు.
హేరీస్ జైరాజ్ మాట్లాడుతూ - ``ఏడాదిన్నర ప్రయాణం. చాలా అటెన్షన్, కేర్ తీసుకుని చేసిన సినిమా ఇది. ఓ రకంగా బాధ్యతగా ఫీలై టీం అంతా కష్టపడ్డాం. సినిమాలో గుడ్ లవ్ లైన్ ఉంది. ఇన్ టెన్స్ థ్రిల్లర్ సబ్జెక్ట్. 34 రోజులు కంటిన్యూగా సినిమా మ్యూజిక్ పూర్తి చేయడానికి పనిచేశాను. ఛాలెంజింగ్‌గానే కాదు, ఓ బాధ్యతగా ఫీలయ్యాను. నెటివిటీ ఆధారంగా తెలుగులో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఒకలా, తమిళంలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరోలా చేశాం. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మహేష్‌కు తమిలంలో కూడా మంచి క్రేజ్ ఉంది. ఆయన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని సంగీతం అందించాను`` అన్నారు.
నిర్మాత ఎన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ - ``తెలుగు హీరోలను తమిళ రంగంలోనికి పరిచయం చేయాలని ఉండేది. చాలాసార్లు మహేష్‌బాబుగారితో, ఈ విషయంపై కలిశాను కూడా. కానీ కుదరలేదు. స్పైడర్ సినిమా విషయానికి వచ్చేసరికి మహేష్‌గారు వెంటనే ఒప్పుకున్నారు. సినిమా రేపు విడుదల కానుంది. తమిళనాట కూడా సినిమాకు భారీ క్రేజ్ నెలకొంది. ఫస్ట్ టైమ్ ఓ తెలుగు హీరోకు తమిళనాడుకు, పెద్ద హీరోకు ఉన్న రేంజ్‌లో థియేటర్స్ హౌస్ ఫుల్‌గా బుక్ అయ్యాయి. మహేష్‌గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ మూవీగానే కాదు, బిగ్గెస్ట్ హిట్ మూవీగా కూడా నిలవబోతుంది`` అన్నారు.
ఠాగూర్ మధు మాట్లాడుతూ - `` చాలా ఎగ్జయిటెడ్‌గా ఉన్నాం. మంచి కమాండ్ ఉన్న హీరో. ఆయనతో వర్క్ చేయడం సూపర్బ్. మేకర్‌గా చాలా శాటిస్పాక్షన్ ఇచ్చిన సినిమా. ఓ రకంగా చెప్పాలంటే కష్టమైన సినిమాయే. హీరో నుండి ప్రతి ఒక్కరూ ఇన్‌వాల్వ్ అయ్యి సినిమా చేశారు. సినిమా రిలీజ్ కావడానికి నెల ముందు వరకు అందరూ బాగా కష్టడ్డారు`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com