భారీ ధరకు మహేష్ 'స్పైడర్ ' నైజాం హక్కులు...

  • IndiaGlitz, [Monday,May 29 2017]

బాహుబ‌లి-2 సినిమా రిలీజ్ త‌ర్వాత మేనియా త‌గ్గింది. ఇప్పుడు ట్రేడ్ వ‌ర్గాల దృష్టి అంతా మ‌హేష్ స్పైడ‌ర్‌పైనే ఉంది. మ‌హేష్‌, ఎ.ఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న స్పైడ‌ర్ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ సినిమా సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల కానుంది. ఈ సినిమా విడుద‌ల‌కు ముందే సినిమా బిజినెస్‌పై క్రేజ్ నెల‌కొంది.
సినీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు స్పైడ‌ర్ నైజాం హ‌క్కుల‌ను 25 కోట్ల‌కు కోనుగోలు చేశాడ‌ని స‌మాచారం. బాహుబ‌లి-2 త‌ర్వాత ఆ రేంజ్ బిజినెస్ జ‌రుపుకున్న చిత్రం స్పైడ‌ర్ మాత్ర‌మేన‌ట‌. మ‌హేష్‌, ర‌కుల్ జంట‌గా న‌టిస్తున్న స్పైడ‌ర్‌లో ఎస్‌.జె.సూర్య విల‌న్‌గా న‌టిస్తున్నాడు.