'స్పైడర్' నెల్లూరు ఏరియా హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ డిస్ట్రిబ్యూటర్
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్, ఎ.ఆర్.మురుగదాస్‌ల 'స్పైడర్' నెల్లూరు ఏరియా హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ హరి.
సూపర్‌స్టార్ మహేష్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'స్పెడర్'.
తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని దసరా కానుగా సెప్టెంబర్ 27న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని నెల్లూరు ఏరియా హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత జి.హరి సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని నెల్లూరులో అత్యధిక థియేటర్స్ లో విడుదల చేయడానికి జి.హరి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా జి.హరి మాట్లాడుతూ "స్పైడర్" వంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ను మా హరి పిక్చర్స్ ద్వారా నెల్లూరు ఏరియాలో విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రాన్ని రికార్డ్ నెంబర్ థియేటర్స్‌లో భారీ రేంజ్‌లో ప్రదర్శించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ అవకాశాన్ని ఇచ్చిన మహేష్‌బాబుగారికి, మురుగదాస్‌గారికి, ఎన్.వి.ప్రసాద్‌గారికి థాంక్స్" అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments