'స్పైడర్' డామినేట్ చేస్తోంది
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కింది మహేష్ బాబు స్పైడర్. ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఆడియో రిలీజ్ ని చెన్నైలో నిర్వహించి.. అక్కడ పలువురు సినీ ప్రముఖులతో మహేష్ తమిళ తెర ఎంట్రీకి ఘన స్వాగతం చెప్పించిన సంగతి తెలిసిందే. ప్రతి షాట్‌ని రెండు భాషల్లోనూ తెరకెక్కించామని మురుగదాస్ ఆ సందర్భంగా చెప్పుకొచ్చారు.
అంతేకాకుండా.. తమిళనాట ఈ సినిమాని అక్కడి స్టార్ హీరోల సినిమా రేంజ్‌లోనే భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ఈ సినిమా 27న విడుదల కానుండగా.. 29న విజయ్ సేతుపతి నటించిన కరుప్పన్, నయనతార అరమ్, సంతానం సర్వర్ సుందరం విడుదల కాబోతున్నాయి.
అయితే స్పైడర్, కరుప్పన్ చిత్రాలే 80 శాతం వరకు తమిళనాడులో థియేటర్లని డామినేట్ చేస్తుండగా.. మిగిలిన 20 శాతం అరమ్, సర్వర్ సుందరం విడుదల కాబోతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి తమిళనాట స్పైడర్ డామినేషన్ బాగానే ఉందన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com