హైదరాబాద్‌కు స్పుత్నిక్ - వి వ్యాక్సిన్ 30 లక్షల డోసులు
- IndiaGlitz, [Tuesday,June 01 2021]
రష్యా దేశానికి చెందిన స్పుత్నిక్ - వి వ్యాక్సిన్లు తెలంగాణకు చేరుకున్నాయి. హైదరాబాద్ విమానాశ్రయానికి ఈ వ్యాక్సిన్ కంటైనర్లు వచ్చాయి. దీంతో దేశంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సిన్ దిగుమతులకు జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో(జీహెచ్ఏసీ) వేదికగా మారింది. మూడో విడతలో 27.9 లక్షల టీకా డోసులు దిగుమతయ్యాయి. ఇప్పటి వరకు భారతదేశానికి దిగుమతైన వ్యాక్సిన్లలో ఇదే అతిపెద్దది. దీంతో దేశంలో అతిపెద్ద వ్యాక్సిన్ దిగుమతి కేంద్రంగా జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసింది.
ఇదీ చదవండి: 2డీజీ ఔషధం వినియోగానికి మార్గదర్శకాలను జారీ చేసిన డీసీజీఐ
రష్యా నుంచి ప్రత్యేక చార్టర్డ్ ఫ్రైటర్ ఆర్‌యూ-9490 విమానం మంగళవారం తెల్లవారుజామున 3:43 గంటల ప్రాంతంలేో టీకాలు తీసుకుని జీహెచ్‌ఏసీకి చేరుకుంది. దీని దిగుమతి ప్రక్రియ అంతా 90 నిమిషాల్లో ముగిసింది. అనంతరం ఈ టీకాలను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌కు తరలించారు. కాగా.. జూన్ రెండో వారం నుంచి స్పుత్నిక్ - వి టీకాల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. కాగా.. అంతకు ముందు రెండు విడతలుగా స్పుత్నిక్ - వి టీకాలు దిగుమతి అయ్యాయి. ఈ క్రమంలోనే తొలి విడతలో 1.5 లక్షల టీకాలు దిగుమతి కాగా.. రెండో విడతలో 60 వేల డోసులను దిగుమతి అయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ మొత్తంగా 30 లక్షల డోసులు భారత్‌కు చేరుకున్నాయి. జూన్‌ల మరో 50 లక్షల డోసులను పంపిస్తామని రష్యా గతంలో వెల్లడించింది.