అమెరికాలో నాగార్జున - ఆధ్యాత్మిక ఆలోచన...

  • IndiaGlitz, [Saturday,May 28 2016]

టాలీవుడ్ కింగ్ నాగార్జున ఊపిరి చిత్రంతో విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. తాజాగా ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున హ‌ధీరామ్ బాబా జీవిత చ‌రిత్ర పై ఓ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మ‌హేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం నాగార్జున గెడ్డం పెంచుతున్నారు. ప్ర‌స్తుతం అమెరికాలో ఉన్న నాగార్జున హ‌ధీరామ్ బాబా చిత్రం గురించి ఆలోచిస్తూ...దేవాల‌యాల‌ను సంద‌ర్శిస్తున్నారు. ఇటీవ‌ల న్యూయార్క్ లోని గ‌ణేష్ టెంపుల్ ని సంద‌ర్శించారు. అక్క‌డ టెంపుల్ అంతా చాలా క్లీన్ ఉంద‌ట‌. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేస్తూ...టెంపుల్ ఫోటోను పోస్ట్ చేసి గ‌ణేష్ టెంపుల్ మేనేజ్ మెంట్ కి థ్యాంక్స్ తెలియ‌చేసారు.
త‌దుప‌రి చిత్రం హ‌థీరామ్ బాబా కోసం ఆధ్యాత్మిక ఆలోచ‌న‌ల‌తో త‌న‌ని తాను ప్రిపేర్ చేసుకుంటున్న‌నాగార్జున త్వ‌ర‌లో హైద‌రాబాద్ రానున్నారు. జులై నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. అన్న‌మ‌య్య‌, శ్రీరామ‌దాసు, శిరిడి సాయి...ఈ మూడు ఆధ్యాత్మిక అద్భుత చిత్రాల‌ను అందించిన ద‌ర్శ‌కేంద్రుడు నాగార్జున తో తాజాగా రూపొందిస్తున్న హ‌థీరామ్ బాబా కూడా ఆధ్యాత్మిక అద్భుత
చిత్రంగా గా నిలుస్తుంద‌ని ఆశిద్దాం.

More News

తమిళ్ లో రీమేక్ చేస్తున్న అంజలి సినిమా..

కథానాయిక అంజలి,శ్రీనివాసరెడ్డి ప్రధాన పాత్రలోరూపొందిన హర్రర్ కామెడీ చిత్రం గీతాంజలి.

న‌రేష్ పై ఫిర్యాదు చేసిన పోసాని..

న‌రేష్ పై ఫిర్యాదు చేసిన పోసాని అన‌గానే...న‌టుడు న‌రేష్ పై అనుకుంటే పొర‌పాటే. అస‌లు విష‌యం ఏమిటంటే...హైద‌రాబాద్ యూస‌ఫ్ గూడ‌కు చెంద‌ని న‌రేష్ అనే వ్య‌క్తి ఇటీవ‌ల పోసాని ఇంటికి వెళ్లి నేను ఇండ‌స్ట్రీలో ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్ గా వ‌ర్క్ చేస్తున్నాను.

టర్కీ వెళుతున్న బన్ని

సరైనోడు బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నెక్ట్స్ మూవీని విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్ లో చేయడానికి సిద్ధమవుతున్నాడు.

జ‌న‌తా గ్యారేజ్ టీజ‌ర్ వ‌చ్చేది అప్పుడే..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందుతున్న‌భారీ చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తుంది. మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు.

అఖిల్ బాధ‌ను బ‌య‌ట‌పెట్టిన‌ నితిన్..

అక్కినేని అఖిల్ న‌టించిన తొలి చిత్రం అఖిల్. వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో హీరో నితిన్ ఈ చిత్రాన్నినిర్మించిన విష‌యం తెలిసిందే. అభిమానులు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న అఖిల్ చిత్రం డిజాస్ట‌ర్ అవ్వ‌డంతో అఖిల్ రెండో సినిమా విష‌యంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు.