ఆ...సెంటిమెంట్ ప్రకారం స్పీడున్నోడు విజయం ఖాయం
Send us your feedback to audioarticles@vaarta.com
అల్లుడు శీను సినిమాతో హీరోగా పరిచయమైన యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్. తొలి చిత్రంతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ చేస్తున్న రెండో సినిమా స్పీడున్నోడు. ఈ చిత్రాన్ని భీమనేని శ్రీనివాసరావు తెరకెక్కించారు. ఫిబ్రవరి 5న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు స్పీడున్నోడు. ఇక అసలు విషయానికి వస్తే...భీమనేని శ్రీనివాసరావు తెరకెక్కించిన శుభమస్తు, శుభాకాంక్షలు, సుస్వాగతం, సూర్యవంశం...తదితర చిత్రాలన్నీ ఘన విజయాలు సాధించాయి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే...భీమనేని శ్రీనివాసరావు ఇంగ్లీషు అక్షరం ఎస్ తో ప్రారంభం అయ్యేలా టైటిల్ పెడితే ఆ సినిమా హిట్టే. ఆ..సెంటిమెంట్ ప్రకారం స్పీడున్నోడు కూడా విజయం సాధించడం ఖాయం. అంతే కాదండోయ్...బెల్లంకొండ శ్రీనివాస్ తొలి చిత్రం అల్లుడు శీను లో తమన్నా తో స్పెషల్ సాంగ్ చేయించారు. ఆ సినిమా ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు స్పీడున్నోడు లో కూడా తమన్నా తో స్పెషల్ సాంగ్ చేయించారు. సో...ఈ సెంటిమెంట్ ప్రకారం కూడా స్పీడున్నోడు విజయం ఖాయం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com