డైరెక్టర్ వినాయక్ చేతుల మీదుగా రిలీజైన స్పీడున్నోడు ఆడియో
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన తాజా చిత్రం స్పీడున్నోడు. ఈ చిత్రాన్ని గుడ్ విల్ సినిమా బ్యానర్ పై భీమనేని శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్, సోనారిక జంటగా నటించారు. తమిళ్ లో విజయం సాధించిన సుందర్ పాండ్యన్ సినిమాకి రీమేక్ గా ఈ సినిమా రూపొందింది. శ్రీ వసంత్ సంగీతం అందించిన స్పీడున్నోడు ఆడియో వేడుక సినీ ప్రముఖుల సమక్షంలో శిల్ప కళావేదికలో ఘనంగా జరిగింది. సంచలన దర్శకుడు వి.వి.వినాయక్ స్పీడున్నోడు ఆడియో సిడిని ఆవిష్కరించి తొలి సిడిని మిల్కీ బ్యూటీ తమన్నాకి అందించగా...హీరోయిన్ రెజీనా థియేటర్ ట్రైలర్ రిలీజ్ చేసారు.
డైరెక్టర్ విజయ్ కుమార్ కొండా మాట్లాడుతూ...హీరోలో ఉన్నస్పీడున్నోడు చూసే ఈ టైటిల్ పెట్టారనుకుంటాను. ఈ సినిమాలో రెండు సాంగ్స్ చూసాను. శ్రీనివాస్ డాన్స్ చాలా బాగా చేసాడు. క్లైమాక్స్ లో శ్రీనివాస్ నటన అందర్నీ ఆకట్టుకుంటుంది అన్నారు.
గీత రచయిత శ్రీమణి మాట్లాడుతూ...ఈ సినిమాలో రెండు పాటలు రాసాను. భీమనేని గారితో వర్క్ చేయడం అంటే ఎవరెస్ట్ ఎక్కడం లాంటిది ఈ సినిమాలో మంచి సాహిత్యంతో పాటలు రాసే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది. వసంత్ గారు మంచి ట్యూన్స్ అందించారు. నా బెస్ట్ ఫ్రెండ్ అంటే తోట శ్రీనివాస్. ఇండస్ట్రీలో నేను ఇలా ఉండటానికి కారణం ఆయనే. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.
నిర్మాత పోకూరి బాబూరావు మాట్లాడుతూ...స్పీడున్నోడు ఖచ్చితంగా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. ఎందుకు అలా చెబుతున్నానంటే తమిళ సినిమాని కొన్ని మార్పులుతో ఈ సినిమా చేసారు. ఫ్రెండ్స్ కోసం, ప్రేయసి కోసం ఎంతకైనా తెగించే యువకుడి కథ ఇది. సుడిగాడు కన్నామంచి హిట్ సాధిస్తుందని ఆశిస్తున్నాను. ఈ సినిమాకి వర్క్ చేసినందరికీ మంచిపేరు తీసుకువస్తుంది. ఫుల్ ప్లడ్జెడ్ హీరోకి కావలసినవన్నీ శ్రీనివాస్ లో ఉన్నాయి. ఈ సినిమాతో శ్రీనివాస్ కి మరింత పేరు వస్తుంది అన్నారు.
నిర్మాత అడ్డాల చంటి మాట్లాడుతూ...80 లో మెగాస్టార్ ఎలా దూసుకొచ్చారో...ఇప్పుడు శ్రీను అలా దూసుకోస్తున్నాడు. డైరెక్టర్ భీమనేని 100% తన ప్రతి సినిమాని హిట్ చేయడానికి ఎంతగానో తపిస్తుంటారు. ఈ సినిమాతో భీమనేని ఖచ్చితంగా హిట్ సాధిస్తారు. స్పీడున్నోడు తో మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వసంత్ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు అన్నారు.
నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ...తొలి సినిమా అల్లుడు శ్రీను తోనే 40 కోట్లు కలెక్ట్ చేసాడు. శుభాకాంక్షలు, శుభమస్తు, సుస్వాగతం
...ఇలా హిట్ సినిమాలు అందించిన భీమనేని ఇప్పుడు స్పీడున్నోడు తో మరో హిట్ సాధించనున్నారు. బిజినెస్ ను స్పీడుగా చేస్తున్న స్పీడున్నోడు సినిమా రిలీజ్ అంతకన్నా స్పీడుగా కలెక్షన్స్ సాధిస్తాడు అన్నారు.
డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ...ట్రైలర్స్ బాగున్నాయి. శ్రీనివాస్ ఎనర్జీ బాగుంది. భీమనేని గారు మా చిన్నప్పుడు కెరీర్ స్టార్ట్ చేసారు. మేము డైరెక్టర్ అయినా ఇంకా ఆయన సినిమాలు చేస్తున్నారు. ఇండస్ట్రీలో గోపీ మోహన్, శ్రీనివాస్ రెడ్డి నా బెస్ట్ ఫ్రెండ్స్ అన్నారు.
హీరోయిన్ హెబ్బా పటేల్ మాట్లాడుతూ...నా అసలు పేరు మరచిపోయి నన్ను ఒక్కొసారి కుమారి అని పిలుస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. స్పీడున్నోడు పాటలు వినలేదు కానీ.. శ్రీవసంత్ చాలా మంచి సంగీతాన్ని అందించారని ఆశిస్తున్నాను. హీరో శ్రీనివాస్ గార్కి, డైరెక్టర్ శ్రీనివాస్ గార్కి ఆల్ ద బెస్ట్ అన్నారు.
గీత రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ...హీరోకి స్పీడు ఎక్కువ. దర్శకనిర్మాతలకు సహనం ఎక్కువ. వేగం, సహనం కలిస్తే విజయం తధ్యం అన్నారు.
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ...ఇండస్టీలో రాశీ, రెజీనా నా బెస్ట్ ఫ్రెండ్స్. లైఫ్ లో ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్. సాంగ్స్ చాలా బాగున్నాయి. స్పీడున్నోడు టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ అన్నారు.
నటుడు కబీర్ జీ మాట్లాడుతూ...ఇండస్ట్రీలో నాకు బెస్ట్ ఫ్రెండ్ మధు. ఇది లవ్ యాక్షన్ డ్రామా. సినిమా యూనిట్ అంతా చాలా కష్టపడ్డాం. స్పీడున్నోడు చాలా మంచి సినిమా. అందరూ థియేటర్ లో ఈ సినిమా చూడండి అన్నారు.
గీత రచయిత కరుణాకర్ మాట్లాడుతూ...భీమనేని గారే నాతో ఓ మంచి సాంగ్ రాయించారు. వసంత్ గారు అదిరిపోయే మ్యూజిక్ అందించారు. హీరో గా ఉండి ఇంత మంచిగా ఉంటారా అనేది ఆయన్ని చూసి తెలుసుకున్నాను. ఈ ప్రాజెక్ట్ లో నాకు అవకాశం ఇచ్చినందుకు భీమనేని గార్కి థ్యాంక్స్ అన్నారు.
హీరోయిన్ తమన్నా మాట్లాడుతూ...బెల్లంకొండ శ్రీనివాస్ ఫస్ట్ ఫిలిం అల్లుడు శీను కంటే ముందే తెలుసు. ఆయన డాన్స్ చూసి ఆశ్యర్యపోయాను.బెల్లంకొండ సురేష్ గార్ని అడిగాను శ్రీనివాస్ ని ఎవరి డైరెక్షన్లో పరిచయం చేస్తున్నారని... వినాయక్ గారి పేరు చెప్పగానే నా నా ఫేవరేట్ డైరెక్టర్ వినాయక్ గారు పరిచయం చేస్తున్నరని తెలిసి హ్యాఫీగా ఫీలయ్యాను. స్పీడున్నోడు శ్రీనివాస్ కి కరెక్ట్ టైటిల్ అన్నారు.
వందేమాతరం శ్రీనివాస్ మాట్లాడుతూ...ఈ పాటలు చూసాకా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని గ్యారెంటీగా చెప్పవచ్చు. ఈ సినిమాకి పాటలు ప్లస్ అవుతాయి. బెల్లంకొండ శ్రీనివాస్ కి ఎంత స్పీడు కావాలో అంత స్పీడు పాటలు శ్రీ వసంత్ అందించాడు అన్నారు.
సంగీత దర్శకుడు శ్రీ వసంత్ మాట్లాడుతూ...నేను ఇచ్చిన ప్రతి పాట ఇంత బాగా వచ్చిందంటే కారణం హీరో శ్రీనివాస్. ఈ సినిమాకి సంగీతం అందించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ భీమనేని, వివేక్ గార్కి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను అన్నారు.
డైరెక్టర్ భీమనేని శ్రీనివాస్ మాట్లాడుతూ... ఒక రీమేక్ సినిమాని నమ్ముకుని 3 సంవత్సరాలు వర్క్ చేసాం. ఈ సినిమా రిలీజ్ తర్వాత మేం పడ్డ కష్టం మీరు గుర్తిస్తారు. వసంత్ చాలా టాలెంట్ ఉన్న పర్సన్. సుడిగాడు బ్లాక్ బష్టర్ మూవీ. ఆతర్వాత వసంత్ కి ఎన్నో అవకాశాలు వస్తాయనుకున్నాను రాలేదు. మళ్లీ కలసి పని చేద్దాం అని చెప్పి ఈ సినిమాకి అవకాశం ఇచ్చాను. 3ఇయర్స్ లో 18 సాంగ్స్ రికార్డ్ చేసి ఈ పాటలు ఫైనల్ చేసాం. ఎంతో మంది ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్స్ ను నేను టార్చర్ పెట్టాను అనుకున్నారు. అయినా ఫరవాలేదు నాకు మంచి అవుట్ ఫుట్ కావాలి. ఈ సినిమా నన్ను ఐదో, పదో సంవత్సరాలు గుర్తుంచుకునే సినిమా అవుతుంది అన్నారు.
డైరెక్టర్ వినాయక్ మాట్లాడుతూ...శ్రీనివాస్ సినిమా పోస్టర్ చూస్తే..వాళ్ల తల్లిదండ్రలు తర్వాత ఆనందించే వ్యక్తి నేనే. ఈ సినిమాలో సీన్స్ చూసాను. చాలా మెచ్యూర్డ్ గా చేసాడు. ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. తమిళ్, కన్నడ లో సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా ఇక్కడ కూడా అంత హిట్ అవుతుంది. సుస్వాగతం ఎంత హిట్ అయ్యిందో..అంతకన్నా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.
హీరో శ్రీనివాస్ మాట్లాడుతూ...వినాయక్ గారు ఈ ఆడియో రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. స్పీడున్నోడు సినిమా గురించి చెప్పాలంటే...వసంత్ గారు ఎక్స్ లెంట్ మ్యూజిక్ ఇచ్చారు. అందరూ మంచి పేరు తెచ్చుకోవాలని పట్టుదలతో ఈ సినిమా చేసాం. అల్లుడు శీను తర్వాత ఫర్ ఫెర్మాన్స్ స్కోప్ ఉన్న సినిమా చేయాలనుకున్నాను. అది భీమనేని గారి ద్వారా ఇలా నెరవేరడం సంతోషంగా ఉంది అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments