స్పీడున్నాడు ఆడియో డేట్ ఫిక్స్..
Send us your feedback to audioarticles@vaarta.com
బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్నచిత్రం స్పీడున్నాడు. ఈ చిత్రాన్ని గుడ్ విల్ సినిమా బ్యానర్ పై భీమనేని శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్, సోనారిక జంటగా నటిస్తున్నారు. తమిళ్ లో విజయం సాధించిన సుందర్ పాండ్యన్ సినిమాకి రీమేక్ గా ఈ సినిమా రూపొందుతుంది. తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఈ సినిమాలో కొన్ని మార్పులు చేసారట. శ్రీ వసంత్ సంగీతం అందిస్తున్న ఈ ఆడియోను ఈనెల 16న గ్రాండ్ గా రిలీజ్ చేసి ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 5న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అల్లుడు శీను తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన రెండో సినిమా ఇది.తొలి చిత్రంతో ఆకట్టుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ రెండో సినిమాతో ఎలాంటి విజయాన్ని సాధిస్తాడో చూద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com