close
Choose your channels

Vangaveeti Radha Krishna:మనసు మార్చుకున్న వంగవీటి రాధా.. త్వరలో పెళ్లిపీటలెక్కనున్న రంగా వారసుడు, అమ్మాయి ఎవరంటే..?

Wednesday, August 16, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దివంగత వంగవీటి మోహన రంగా తనయుడు, టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ పెళ్లి పీటలెక్కనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన యువతితో పెద్దలు ఆయన వివాహం నిశ్చయించినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 19 ఎంగేజ్మెంట్, అక్టోబర్‌లో పెళ్లి జరగనున్నట్లుగా సమాచారం. ఇప్పటి వరకు పెళ్లి గురించి పట్టించుకోని రాధాకృష్ణ.. ఇన్నాళ్లకు మనసు మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే వివాహానికి సంబంధించి వంగవీటి కుటుంబం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.

వరుసగా రెండు ఎన్నికల్లో రాధా ఓటమి :

ఇదిలావుండగా.. వంగవీటి మోహనరంగా వారసుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రాధాకృష్ణ 2004లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గెలిచారు. 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరిన రాధా విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీలో చేరిన రాధా.. 2014 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత జరిగిన పరిణామాల మధ్య 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే నాటి ఎన్నికల్లో పోటీ చేయకుండా కేవలం పార్టీ అభ్యర్ధుల తరపున ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యారు.

ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో రాధా :

మీడియాకు దూరంగా వుండే వంగవీటి రాధా వ్యూహాత్మకంగా అడుగులు వేయడంలో తడబడుతూ వరుసగా ఓడుతూ వస్తున్నారు. ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఆయన వున్నారు. గుడివాడ, అవనీగడ్డ, బందర్, విజయవాడ సెంట్రల్‌లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి రాధా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ నేతృత్వంలోనే జనసేనలో వంగవీటి వారసుడు పోటీ చేస్తాడనే ప్రచారం జరుగుతోంది. దీనిపైనా క్లారిటీ రావాల్సి వుంది. కానీ వంగవీటి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్తతో రంగా అభిమానుల్లో సంతోషాన్ని నింపింది.
 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment