స్టార్ మా లో ఈ ఆదివారం.. విందు భోజనం
Send us your feedback to audioarticles@vaarta.com
స్టార్ మా లో ఈ ఆదివారం.. అంటే ఫిబ్రవరి 7న .. మరింత స్పెషల్ గా ఉండబోతోంది . అభిమాన సెలెబ్రిటీలు అందరూ ప్రేక్షకులను అలరించేందుకు తెలుగు లోగిళ్ళకు రాబోతున్న ఈ ఆదివారం వినోదం ఓ విందు భోజనంలా ఉండబోతోంది.
ప్రేక్షకులు ఎంతో అభిమానించే రెగ్యులర్ కార్యక్రమాలతో పాటు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ "రేస్ అఫ్ ఎంటర్ టైన్మెంట్ " ప్రారంభం కోబోతోంది. తన మాటలతో మాయాజాలం చేసే సీనియర్ యాంకర్ సుమ "స్టార్ట్ మ్యూజిక్" తో చేస్తున్న సందడి ఓ రేంజ్ లో ఉండబోతోంది. గంటన్నర పాటు సెలెబ్రిటీలతో మ్యూజికల్ గా చేసే మేజిక్ కడుపుబ్బా నవ్విస్తుంది. నవ్వి నవ్వి అలసిపోయి, ఈ షో నుంచి కొద్దీ క్షణాలు రిలాక్స్ కాగానే 1.30 గంటలకు "కామెడీ స్టార్స్" కంటిన్యూ అవుతుంది. యాంకర్ వర్షిణి చేసే అల్లరి, కామెడీ టీమ్స్ చేసే హంగామా, సెటైర్లు , పంచ్ లు, ఈలలు, గోలలు .. ఇక ఈ గంటన్నర సమయం తెలియకుండానే గడిచిపోతుంది.
ఇక సాయంకాలం ఆరు గంటలకు మరో వెరీ వెరీ స్పెషల్ ఈవెంట్ సిద్ధంగా ఉంటుంది. అదే "బిగ్ బాస్ ఉత్సవం". తెలుగు బుల్లితెర వినోదం లో సరికొత్త అధ్యాయంలా తెలుగు ప్రేక్షకులకు స్టార్ మా అందించిన బిగ్ బాస్ ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు. ఎంటర్ టైన్మెంట్ లైక్ నెవెర్ బిఫోర్ అనే టాగ్ లైన్ తో వచ్చిన సీజన్ 4 కంటెస్టెంట్స్ అందరూ ఒకే వేదిక పైకి వచ్చి పండగ వాతావరణాన్ని సృష్టించబోతున్నారు. హౌస్ మేట్స్ లా వచ్చి స్టార్స్ అయిన కంటెస్టెంట్స్ అందరూ రీ యూనియన్ లా ఒక చోట కనిపించడం కన్నుల పండువ అయితే ... వాళ్ళు చేసే ఫన్ ఎప్పటికీ మరువరానిది.
సో.. ఈ ఆదివారం.. స్టార్ మా లో మీకు విందు భోజనం సిద్ధం గా వుంది. గెట్ రెడీ.
"బిగ్ బాస్ ఉత్సవం" ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments