సూర్య '24' స్పెషాలిటీ...
Send us your feedback to audioarticles@vaarta.com
'మనం' దర్శకుడు విక్రమ్ కుమార్ డైరెక్షన్‌లో సూర్య నటిస్తున్న చిత్రం '24'. నిత్యా మీనన్, సమంత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా 2016 సమ్మర్‌లో రిలీజ్ కానుంది. ఎ.ఆర్.రెహమాన్ సంగీతమందిస్తున్నారీ సినిమాకి.
ఇదిలా ఉంటే.. కోలీవుడ్లో వినిపిస్తున్న కథనాల ప్రకారం సూర్య ఇందులో మూడు తరాల వేషాల్లో కనిపించనున్నారట. అంటే.. ఈ తరం యువకుడు, అతని తండ్రి, ఆ యువకుడి తాత.. ఇలా అన్నమాట. టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటంటే.. 24 ఏళ్ల వయసులో ఈ మూడు జనరేషన్‌ల వారికి ఎదురైన సేమ్ సిట్యుయేషనే '24' కథ అట. ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments