ఫిబ్రవరి-02కు ఉన్న ప్రత్యేకత తెలుసా!?

  • IndiaGlitz, [Sunday,February 02 2020]

నేడు ఫిబ్రవరి-02. అంటే.. 02.02 అన్నమాట. ఏడాదితో కలిపితే.. 02.02.2020. ఒక్కసారి క్లారిటీగా చదివండి మ్యాజిక్ ఏంటో తెలుస్తుంది. అర్థం కావట్లేదా..? ఇప్పుడు ఒకసారి రివర్స్ చేసి చదవండి అసలు విషయం మీకే తెలుస్తుంది. వెనకి నుంచి చదివినా.. ముందు నుంచి చదవినా ఒక్కటే అర్థం వస్తుంది.. ఒకే సంఖ్యలా కనిపిస్తుంది. ఇదే ఫిబ్రవరి-02కు ఉండే మ్యాజిక్. భలేగుంది కదూ..!

ఎటు చూసినా..!

కాగా.. నేడు సూపర్ బౌల్ సండే, గ్రౌండ్‌హాగ్ డే, పాలిండ్రోమ్ డే కావడం మరో విశేషమని చెప్పుకోవచ్చు. ఈ విషయంపై నిపుణులు స్పందిస్తూ.. ఇలాంటి రోజు చాలా అరుదుగా వస్తుంటుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇలా రానున్న రోజుల్లో 12-02-2021 కూడా ఇలాగే రానుందని విశ్లేషకులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా విచిత్రమేమిటంటే.. ఫిబ్రవరి 2 అనేది 2020 యొక్క 33వ రోజు.. ఈ ఏడాదిలో సంవత్సరంలో 333 రోజులు మిగిలి ఉండటం మరో విశేషం. మరీ ముఖ్యంగా ఇవాళ పుట్టిన రోజు జరుపుకునే వారు.. ఇవాళ జన్మించిన వారు నిజంగా లక్కీ అని కూడా పండితులు చెబుతున్నారు.

ఇప్పటి వరకూ ఏమొచ్చాయ్!?

ఇలాంటి ‘పాలిండ్రోమ్ డేలు’ ఎక్కువగా అక్టోబర్ నెలలో వస్తుంటాయి. ఇదివరకే 01-10-2011, 2-10-2012, 3-10-2013,4-10-2014, 5-10-2015, 6-10-2016, 7-10-2017, 8-10-2018, 9-10-2019 అక్టోబర్‌ నెలలో వచ్చాయి.

తెలుగు పదాల్లో కూడా..!

తెలుగు పదాల్లో కొన్ని ఎటు చూసినా ఒకేలా అర్థం వచ్చేవి ఉన్నాయి. వికటకవి, టమాటా, కిటికి లాంటి పదాలను ఎటు చూసినా ఒకేలా వస్తాయి. సో.. ఈ తెలుగు పదాల లాగే.. 02-02-2020ను ఎటు చూసినా ఒకేలా వస్తుందన్న మాట.