దేవిశ్రీ ప్రసాద్ టీవీ షో... స్పెషాలిటీ అదే!
Send us your feedback to audioarticles@vaarta.com
దేవిశ్రీ ప్రసాద్‌కి సుడి మామూలుగా లేదు. మొన్నటికి మొన్నే ఉప్పెన బ్లాక్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు పుష్ప ప్యాన్ ఇండియా మూవీ రెడీ అవుతోంది. మరో వైపు శివరాత్రి సందర్భంగా ఆయన కంపోజ్ చేసిన ఈశ్వరా పాటకు కృతి శెట్టి కూచిపూడి నృత్యం చేసింది. ఇన్నేసి విషయాలు వరుస బెట్టి జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు దేవిశ్రీ కూడా నా వంతు నా ఫ్యాన్స్ కి నేనిచ్చే గిఫ్ట్ ఇదే అంటూ శుక్రవారం సాయంత్రం సైలెంట్ గిఫ్ట్ ని అనౌన్స్ చేసేశారు. త్వరలోనే స్మాల్ స్క్రీన్ మీద అప్పియరెన్స్ ఇవ్వబోతున్నారనేదే ఆ గిఫ్ట్. స్టార్ టు రాక్‌స్టార్ అనే టీవీ షో ఆయన చేయబోతున్నారు. ఈ రియాలిటీ షో జీ తమిళ్లో ప్రసారం కానుంది. డీఎస్పీ, ఆయన గ్యాంగ్ కలిసి ఈ షోలో ప్రత్యేకమైన అవతార్‌లో కనిపించబోతున్నారు.
ఇది మరో లెవల్ మ్యూజికల్ ఫెనోమెనా అంటూ ఈ రియాలిటీ షోని అనౌన్స్ చేసింది జీ తమిళ్. అంతే కాదు అత్యంత గొప్ప సంగీత స్టేజ్ మీద పలు రకాలైన వినోదాన్ని పంచబోతున్నట్టు దేవిశ్రీ స్వయంగా అనౌన్స్ చేశారు. త్వరలోనే స్టార్ టు రాక్ స్టార్ జీ తమిళ్లో వస్తుందని ఆయన తెలిపారు. చూడండి... ఎప్పుడూ... ఎక్కడైనా జీ5లో అంటూ ఆయన తన లేటెస్ట్ షో గురించి రాశారు. సో దేవిశ్రీ ప్రసాద్ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే పనిలో ఉన్నారు.
కంపోజర్‌గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ, బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకోకూడదనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు నియర్ అండ్ డియర్స్ అంటున్నారు. సో మన రాక్‌స్టార్ డీఎస్పీ కి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com