యాదాద్రి ఆలయ ప్రత్యేకతలేంటంటే..: ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి

  • IndiaGlitz, [Saturday,February 27 2021]

యాదాద్రి పైన ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, స్మారక టవర్లు (గోపురాలు), ఊపిరి తీసుకునే శిల్పాలు, మండపాలు, ప్రాకారాలు, స్తంభాల వరకూ ప్రతిదీ అద్భుతమే. ఇంతటి అద్భుతానికి సృష్టికర్త ఆనంద్ సాయి. గత ఐదేళ్లుగా యాదాద్రి ఆలయ డిజైనింగ్‌ కోసం శ్రమిస్తున్నారు. ఈ ప్రాజెక్టు దాదాపు పూర్తి కావొచ్చిన సందర్భంగా ఆయన నేషనల్ మీడియాతో మాట్లాడుతూ.. ఇంతటి అద్భుతమైన దైవకార్యంలో తాను భాగస్వామి అయినందుకు పెట్టిపుట్టానని తెలిపారు.

ఇంకా ఆనంద్ సాయి మాట్లాడుతూ..‘‘గత ఐదేళ్లుగా నేను పూర్తిగా యాదాద్రి ఆలయానికే అంకితమయ్యాను. ఈ దైవకార్యం పూర్తయ్యే వరకూ నేను ఏ సినిమా చేయకూడదని నిర్ణయించుకున్నా. ఈ ఆలయానికి సంబంధించిన వర్క్ నాకు దక్కడమనేది గౌరవంగా భావిస్తున్నాను. నన్ను నమ్మి నాకు ఈ వర్క్ అప్పజెప్పిన సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎన్నోసార్లు కేసీఆర్‌గారు ఆలయాన్ని సందర్శించారు. ఆయన ఏదో ఒక ఆసక్తికరమైన ఐడియాతో వచ్చేవారు. సీఎం సర్ ఈ ప్రాజెక్ట్ పట్ల చాలా ఆసక్తి కనబరిచడంతో పాటు యుద్ధ ప్రాతిపదికన ఆలయ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు’’ అని వెల్లడించారు. ఆనంద్ ప్రస్తుతం కొత్త సచివాలయ ప్రాంగణంలో వస్తున్న ఆలయాన్ని కూడా రూపొందించారు.

నాలుగు రకాల శైళులను సంతరించుకున్న ప్రపంచంలోనే తొలి ఆలయం యాదాద్రి కావడం విశేషం. పల్లవ, చాళుక్య, ద్రవిడియన్, కాకతీయుల శైలిని ఆలయ నిర్మాణంలో వాడినట్టు ఆనంద్ సాయి వెల్లడించారు. అలాగే ఈ ఆలయ నిర్మాణంలో గుంటూరు నుంచి తీసుకొచ్చిన నల్లటి గ్రానైట్ రాయిని ఉపయోగించినట్టు తెలిపారు. ఆగమన శాస్త్రానుసారంగా ఈ ఆలయ నిర్మాణం జరుగుతోంది. ఈ ఆలయ డిజైనింగ్ కోసం తాను విస్తృతమైన పరిశోధన చేయాల్సి వచ్చిందని.. ఆలయ నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి తాను అనేక ఆగ్నేయాసియా దేశాలను సందర్శించానని.. చివరికి యాదాద్రి కోసం అనేక డిజైన్లతో ముందుకు వచ్చానని ఆనంద్ వెల్లడించారు.

అలాగే చిన్న జీయర్ స్వామితో కలిసి పనిచేయడం గురించి ఆనంద్ సాయి మాట్లాడుతూ.. ‘‘చిన్న జీయర్ స్వామీజీతో కలిసి పనిచేయడం చాలా సంతృప్తికరంగా అనిపించింది. నేను చాలా నేర్చుకున్నాను. ఆయనతో ప్రయాణం నన్ను మరింత ఆధ్యాత్మికం వైపు నడిపించింది. ఆయనతో పనిచేసిన తరువాత నా జీవితం పూర్తిగా మారిపోయింది. ఆధ్యాత్మిక ప్రకంపనలు, అనుభవాలు నా జీవితాన్నే మార్చేశాయి” అని తెలిపారు. ఈ ప్రాజెక్టులో తనతో కలిసి పని చేసిన వారి గురించి ఆనంద్ మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రాజెక్టు చేస్తున్నప్పుడు నాలెడ్జ్ షేరింగ్ బాగా జరిగేది. ఇది జీవితంలో ఒక్కసారి మాత్రమే కలిగే అనుభవం కాబట్టి చాలా ఎంజాయ్ చేశాను’’ అని వెల్లడించారు.

More News

కొత్త క‌ళ నేర్చుకుంటోన్న రాశీఖ‌న్నా

హీరోయిన్ రాశీఖ‌న్నాముందు ఇక ఎవ‌రైనా పోకిరి వేషాలేస్తే అంతేనండోయ్‌! ఎందుకంటే.. ఈ అమ్మ‌డు ఇప్పుడు కొత్త విద్య‌ను నేర్చుకుంటోంది.

ఆస్కార్ బ‌రిలో  ‘ఆకాశం నీ హ‌ద్దురా’

ఆస్కార్ బ‌రిలో దిగే సినిమాల లిస్టుల‌ను ఆస్కార్ అవార్డుల అకాడ‌మీ ప్ర‌క‌టించింది. 93వ ఆస్కార్ అకాడ‌మీ రేసులో పాల్గొన‌బోయే 366 చిత్రాలను క‌మిటీ ప్ర‌క‌టించింది.

బాల‌య్య స్థానంలో నాగార్జున‌..!

యువ క‌థానాయ‌కుడు నాగశౌర్య చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఒక వైపు ల‌క్ష్య‌, వ‌రుడు కావాలెను చిత్రాలతో పాటు తన బ్యానర్లో అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో

‘అణ్ణాత్త‌’ షూటింగ్ డేట్ ఎప్పటి నుంచో తెలుసా?

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ 168వ చిత్రం ‘అణ్ణాత్త‌’ శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటున్న సమయంలో కరోనా కారణంగా సినిమా షూటింగ్ ఆగింది.

'A' మూవీ టీం ని అభినందించిన విజయ్ సేతుపతి..!!!

నితిన్ ప్రసన్న హీరోగా ప్రీతి అస్రాని హీరోయిన్ గా యుగంధర్ ముని దర్శకత్వంలో అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై  గీతా మిన్సాల నిర్మించిన చిత్రం ‘A’.