2015 తెలుగు సినిమా ప్రత్యేకత ఇదే...
- IndiaGlitz, [Wednesday,November 18 2015]
ఫలితాలు, నిడివి.. ఇలాంటి విషయాలను పక్కన పెడితే.. 2015 తెలుగు సినిమా చాలా ప్రత్యేకం. ఎందుకంటే.. రెండు తరాల అగ్ర కథానాయకులు వెండితెరపై సందడి చేశారు కాబట్టి.
చిరంజీవి (బ్రూస్‌లీ - గెస్ట్ రోల్), బాలకృష్ణ (లయన్), వెంకటేష్ (గోపాల గోపాల), నాగార్జున (దొంగాట, అఖిల్ - గెస్ట్ రోల్).. ఇలా ఓ జనరేషన్ టాప్ హీరోలతో పాటు.. పవన్ కళ్యాణ్ (గోపాల గోపాల), మహేష్‌బాబు (శ్రీమంతుడు), ఎన్టీఆర్ (టెంపర్), ప్రభాస్ (బాహుబలి), అల్లు అర్జున్ (సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి), రామ్‌చరణ్ (బ్రూస్‌లీ), రవితేజ (కిక్ 2, బెంగాల్ టైగర్).. వంటి ఈ తరం అగ్ర కథానాయకులు 2015లో సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేశారు.
చరణ్ ఎంట్రీకి ముందు 2004, 2005, 2006లలో కూడా రెండు జనరేషన్‌ల టాప్ హీరోలు వెండితెరపై దర్శనమిచ్చారు. మళ్లీ ఇన్నేళ్లకు నిడివిలతో సంబంధం లేకుండా రెండు జనరేషన్‌ల టాప్ హీరోలు అభిమానులను, ప్రేక్షకులను అలరించారు. రానున్న సంవత్సరాల్లో పూర్తిస్థాయి పాత్రలతో ఇలాంటి సందర్భాలు రావాలని ఆకాంక్షిద్దాం.