పవన్ - రానా మూవీ నుంచి స్పెషల్ ట్రీట్ నేడే!
Send us your feedback to audioarticles@vaarta.com
సోమవారం రోజు పవన్- రానా మల్టీస్టారర్ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభం అయింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పవన్ కళ్యాణ్ పాత్ర పేరు రివీల్ చేస్తూ ప్రీ లుక్ ఒకటి విడుదల చేశారు. భీమ్లా నాయక్ గా పవన్ పోలీస్ అధికారిగా ఈ చిత్రంలో నటిస్తున్నాడు. పవన్ పోలీస్ గెటప్ లో ఉన్న లుక్ సోషల్ మీడియాలో సునామి సృష్టించింది.
ఇదీ చదవండి: ఇంటర్వ్యూ : గ్లామర్ రోల్స్ కి అభ్యంతరం లేదు- తెలుగమ్మాయి మాయ
అంతలోనే చిత్ర యూనిట్ అభిమానులకు మరో సర్ ప్రైజ్ ఇచ్చేసింది. నేడు అంటే మంగళవారం సాయంత్రం 4:05 గంటలకు స్పెషల్ మేకింగ్ వీడియో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేకింగ్ వీడియోలో ఓ సర్ ప్రైజ్ కూడా ఉందట. ఈ ప్రకటనతో అభిమానుల్లో ఎగ్జైట్ మెంట్ పెరిగిపోయింది.
పవర్ స్ట్రామ్ బ్యాక్ తో షూట్ అంటూ చిత్ర యూనిట్ ఈ అప్డేట్ ఇచ్చింది. మలయాళంలో ఘనవిజయం సాధించిన అయ్యప్పన్ కోషియం చిత్రానికి ఇది రీమేక్. పవన్, రానా కలసి తొలిసారి నటిస్తుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అప్పట్లో ఒకడుండేవాడు ఫేమ్ సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకుడు.
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తమన్ సంగీత దర్శకుడు. పవన్ కి జోడిగా నిత్యామీనన్, రానా సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు.
Power Storm back to shoot ??
— Sithara Entertainments (@SitharaEnts) July 27, 2021
Special making video with a surprise from the sets of #ProductionNo12 coming out today at 4:05PM!
Stay glued ?? #BheemlaNayak Power Star @PawanKalyan @RanaDaggubati #Trivikram @MusicThaman @saagar_chandrak @dop007 @vamsi84 @NavinNooli pic.twitter.com/PRYAkYSua8
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com