పవన్ - రానా మూవీ నుంచి స్పెషల్ ట్రీట్ నేడే!

  • IndiaGlitz, [Tuesday,July 27 2021]

సోమవారం రోజు పవన్- రానా మల్టీస్టారర్ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభం అయింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పవన్ కళ్యాణ్ పాత్ర పేరు రివీల్ చేస్తూ ప్రీ లుక్ ఒకటి విడుదల చేశారు. భీమ్లా నాయక్ గా పవన్ పోలీస్ అధికారిగా ఈ చిత్రంలో నటిస్తున్నాడు. పవన్ పోలీస్ గెటప్ లో ఉన్న లుక్ సోషల్ మీడియాలో సునామి సృష్టించింది.

ఇదీ చదవండి: ఇంటర్వ్యూ : గ్లామర్ రోల్స్ కి అభ్యంతరం లేదు- తెలుగమ్మాయి మాయ

అంతలోనే చిత్ర యూనిట్ అభిమానులకు మరో సర్ ప్రైజ్ ఇచ్చేసింది. నేడు అంటే మంగళవారం సాయంత్రం 4:05 గంటలకు స్పెషల్ మేకింగ్ వీడియో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేకింగ్ వీడియోలో ఓ సర్ ప్రైజ్ కూడా ఉందట. ఈ ప్రకటనతో అభిమానుల్లో ఎగ్జైట్ మెంట్ పెరిగిపోయింది.

పవర్ స్ట్రామ్ బ్యాక్ తో షూట్ అంటూ చిత్ర యూనిట్ ఈ అప్డేట్ ఇచ్చింది. మలయాళంలో ఘనవిజయం సాధించిన అయ్యప్పన్ కోషియం చిత్రానికి ఇది రీమేక్. పవన్, రానా కలసి తొలిసారి నటిస్తుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అప్పట్లో ఒకడుండేవాడు ఫేమ్ సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకుడు.

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తమన్ సంగీత దర్శకుడు. పవన్ కి జోడిగా నిత్యామీనన్, రానా సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు.

More News

ఇంటర్వ్యూ : గ్లామర్ రోల్స్ కి అభ్యంతరం లేదు- తెలుగమ్మాయి మాయ

తెలుగమ్మాయి మాయ నెల్లూరి న్యూజిలాండ్ లో సెటిల్ అయింది. నటనపై ఆసక్తితో టాలీవుడ్ లో అవకాశాల కోసం తిరిగి ఇండియాకి వచ్చింది.

5 భాషలు, ఐదుగురు సింగర్స్.. RRR ఫస్ట్ సాంగ్ కు ముహూర్తం ఫిక్స్

దర్శకధీరుడు రాజమౌళి సారధ్యంలో ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రమోషనల్ స్ట్రాటజీస్ అదిరిపోతున్నాయి.

హర్రర్ తో నాగచైతన్య ఓటిటి ఎంట్రీ.. మూడోసారి అదే డైరెక్టర్ తో..

అక్కినేని హీరో నాగ చైతన్య రొమాంటిక్, ఎమోషనల్ ప్రేమకథా చిత్రాలతో దూసుకుపోతున్నాడు.

భారీ సెటప్ తో మొదలుకానున్న శంకర్, రాంచరణ్ మూవీ!

ఆర్ఆర్ఆర్ ముగియగానే మెగాపవర్ స్టార్ రాంచరణ్ మరో భారీ చిత్రానికి రెడీ అవుతున్నాడు.

కళ్ళు చెదిరే ధరకు RRR ఆడియో రైట్స్!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ఆర్ఆర్ఆర్ షూటింగ్ దాదాపుగా పూర్తయింది.