'పుష్ప' కోసం సెట్‌

  • IndiaGlitz, [Tuesday,February 16 2021]

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘పుష్ప’. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఇప్ప‌టికే మారేడు మిల్లి, రంప‌చోడ‌వరంల‌లో రెండు షెడ్యూల్స్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. ఇప్పుడు తెన్‌కాశీ, పొల్లాచ్చిలో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇందులో బ‌న్ని, ర‌ష్మిక మంద‌న్న‌పై రొమాంటిక్ స‌న్నివేశాలు, సాంగ్స్‌ను చిత్రీక‌రిస్తున్నార‌ట‌. కాగా.. ర‌ష్మిక మంద‌న్న పాత్ర‌కు సంబంధించిన కొన్ని స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ కోసం హైద‌రాబాద్‌లో ఓ విలేజ్ సెట్‌ను సుకుమార్ వేయిస్తున్నాడ‌ని వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

శేషాచ‌ల అడ‌వుల్లో జ‌రిగే ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో పుష్ప సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో పుష్ప‌రాజ్ అనే లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో అల్లు అర్జున్ న‌టిస్తున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ముత్తం శెట్టి మీడియా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగ‌స్ట్ 13న ప్యాన్ ఇండియా లెవ‌ల్లోసినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.ఆర్య, ఆర్య 2 చిత్రాల తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూడో చిత్రమే కాదు..వీరి కాంబినేషన్‌లో రూపొందుతోన్న తొలి ప్యాన్ ఇండియా మూవీ.