సాయిధరమ్ చిత్రంలో ఆ పాత్ర ప్రత్యేకమట
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే.. తన సినిమాల్లో నాయికలను అందంగా చూపించడమే కాదు.. వారి పాత్రలను కూడా చాలా ప్రత్యేకంగా డిజైన్ చేస్తుంటారు కరుణాకరన్. అదేవిధంగా ఈ సినిమాలో కూడా కథానాయిక అనుపమ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటూనే.. ఆమె చుట్టూనే కథ మొత్తం నడుస్తుందని సమాచారం.
ఈ విషయాన్ని తేజుతో ముందుగానే చర్చించారట దర్శకుడు. అయితే, కథ చాలా కొత్తగా ఉండడంతో తేజు కూడా ఓకే చెప్పాడని సమాచారం. ఇంతకుముందు, కథానాయికకు ప్రాధాన్యత ఉన్న సినిమా అయిన ఫిదా` చేసి మరో మెగా హీరో వరుణ్ తేజ్ విజయాన్ని సాధించి ఉండడంతో.. ఇప్పుడు వరుణ్ బాటలోనే తేజు కూడా నడుస్తున్నాడని ఇండస్ట్రీ టాక్. మరి వైవిధ్యంగా సాగే ఈ సినిమాతోనైనా తేజు విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments