సాయిధరమ్ చిత్రంలో ఆ పాత్ర ప్రత్యేకమట

  • IndiaGlitz, [Thursday,February 22 2018]

ప్రేమ‌క‌థా చిత్రాల స్పెష‌లిస్ట్ ఎ.క‌రుణాక‌ర‌న్‌ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే.. తన సినిమాల్లో నాయికలను అందంగా చూపించడమే కాదు.. వారి పాత్రలను కూడా చాలా ప్రత్యేకంగా డిజైన్ చేస్తుంటారు క‌రుణాక‌ర‌న్‌. అదేవిధంగా ఈ సినిమాలో కూడా క‌థానాయిక అనుపమ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటూనే.. ఆమె చుట్టూనే కథ మొత్తం నడుస్తుందని సమాచారం.

ఈ విషయాన్ని తేజుతో ముందుగానే చ‌ర్చించార‌ట దర్శకుడు. అయితే, కథ చాలా కొత్తగా ఉండడంతో తేజు కూడా ఓకే చెప్పాడ‌ని సమాచారం. ఇంత‌కుముందు, క‌థానాయిక‌కు ప్రాధాన్యత ఉన్న సినిమా అయిన ఫిదా' చేసి మ‌రో మెగా హీరో వరుణ్ తేజ్ విజయాన్ని సాధించి ఉండ‌డంతో.. ఇప్పుడు వరుణ్ బాటలోనే తేజు కూడా నడుస్తున్నాడ‌ని ఇండస్ట్రీ టాక్. మరి వైవిధ్యంగా సాగే ఈ సినిమాతోనైనా తేజు విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.

More News

'వంశధార క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1' ప్రారంభోత్సవం

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా యువ ప్రతిభాశాలి శ్రీనివాస్ దర్శకత్వంలో

ముందే వ‌స్తున్న ఆ రెండు చిత్రాలు

ఓ సినిమాని అనుకున్న తేదికి అనుకున్న‌ట్లుగా విడుద‌ల చేయ‌డం అన్ని సంద‌ర్భాల్లోనూ సాధ్య‌ప‌డ‌దు. ఎక్కువ సార్లు వాయిదా వేసే ప‌రిస్థితులు ఉంటే.. అతి త‌క్కువ సంద‌ర్భాల్లో అనుకున్న స‌మ‌యం కంటే ముందే విడుద‌ల చేసే ప‌రిస్థితులు ఉంటాయి.

మ‌హేష్‌ పై కైరా ప్ర‌శంస‌ల వ‌ర్షం

సూపర్ స్టార్ మహేష్ బాబు క‌థానాయ‌కుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'భరత్ అనే నేను'. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకి కొరటాల శివ దర్శక‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో మహేష్ సమైఖ్యాంధ్ర ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తున్నారు. బాలీవుడ్ న‌టి కైరా అద్వాని ఈ సినిమా ద్వారా  తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌వుతున్న సంగ‌తి తెలిసిందే.

'వాడేనా' గీతావిష్కరణ

నిర్మాణి ఫిలిమ్స్ బ్యానర్ పై ఓం సాయి రామ్ సమర్పణలో శివ తాండేల్,నేహా దేశ్ పాండే జంటగా నటిస్తున్న చిత్రం 'వాడేనా'.

సుధీర్ బాబు హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో 'సమ్మోహనం'

సుధీర్ బాబు,బాలీవుడ్ నటి అదితిరావు హైదరీ జంటగా మోహన కృష్ణ ఇంద్ర గంటి దర్శకత్వంలో