'రంగ‌స్థ‌లం'లో ఆ పాత్ర చాలా స్పెష‌ల్

  • IndiaGlitz, [Saturday,November 18 2017]

ద‌ర్శ‌కుడు ర‌విరాజా పినిశెట్టి త‌న‌యుడుగా తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన క‌థానాయ‌కుడు ఆది పినిశెట్టి. తెలుగుతో పాటు త‌మిళంలోనూ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ టాలెంటెడ్ ఆర్టిస్ట్‌.. గ‌తేడాది వ‌చ్చిన స‌రైనోడు చిత్రంతో ప్ర‌తినాయ‌కుడుగా ట‌ర్న్ అయ్యాడు.

ఆ సినిమాతో బెస్ట్ విల‌న్ గా నంది అవార్డుని సైతం సొంతం చేసుకున్నాడు. కాగా, ఇటీవ‌ల నిన్ను కోరిలోని కీల‌క పాత్ర‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆది.. ప్ర‌స్తుతం మూడు తెలుగు చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. వాటిలో ఒక‌టి రంగ‌స్థ‌లం 1985. రామ్‌చ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తున్న ఈ సినిమాకి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

ఈ సినిమాలో ఆది పోషిస్తున్న పాత్ర చాలా స్పెష‌ల్‌గా ఉంటుంద‌ట‌. అంతేకాకుండా.. సినిమాకి మెయిన్ పిల్ల‌ర్ లాంటి ఈ క్యారెక్ట‌ర్‌.. ఆడియ‌న్స్‌ని స‌ర్‌ప్రైజ్ చేస్తుంద‌ని తెలిసింది. రామ్‌చ‌ర‌ణ్‌తో ఈ క్యారెక్ట‌ర్‌కి ఉండే బాండింగ్.. ఈ రెండు పాత్ర‌ల మ‌ధ్య సంఘర్ష‌ణ సినిమాకి కీల‌క‌మ‌ని తెలిసింది. స‌మంత హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందిస్తున్నాడు. స‌మ్మ‌ర్ లో ఈ సినిమా విడుద‌ల కానుంది.