మంచు ఫ్యామిలీకి ఆ రోజు ప్రత్యేకం
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ ఫిబ్రవరి మాసం.. మంచు కుటుంబానికి చెందిన నటులకు ప్రత్యేకం కానుంది. ఎందుకంటే.. ఒకే రోజున మంచు ఫ్యామిలీకి చెందిన ముగ్గురు నటులు నటించిన రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి మరి. కాస్త వివరాల్లోకి వెళితే.. మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం గాయత్రి`. మోహన్ బాబు రెండేళ్ళ గ్యాప్ తరువాత నటిస్తున్న చిత్రమిది.
అంతేకాదు.. కథానాయకుడిగానూ, ప్రతినాయకుడిగానూ ఆయన రెండు పాత్రల్లో సందడి చేయనున్నారు. మదన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 9న విడుదల కానుంది. సరిగ్గా అదే రోజున మంచు ఫ్యామిలీకి చెందిన మరో సినిమా రానుంది. అయితే అది తెలుగు సినిమా కాదు.. ఆంగ్ల చిత్రం. ఆ సినిమానే బాస్మతి బ్లూస్`. ఇందులో మంచు లక్ష్మి ఓ కీలక పాత్రలో సందడి చేయనుంది. ఆస్కార్ విన్నింగ్ యాక్ట్రస్ బ్రీ లార్సన్ ఇందులో ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా కూడా ఫిబ్రవరి 9నే ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తమ్మీద.. ఫిబ్రవరి 9 మంచు కుటుంబంలోని ముగ్గురు నటులకి స్పెషల్ కానుందన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com