శర్వా 25 చిత్రాల ప్రస్ధానం - నవ్యతే ఈ ఎక్స్ ప్రెస్ రాజా గమ్యం
Send us your feedback to audioarticles@vaarta.com
రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు, ఎక్స్ ప్రెస్ రాజా...ఈ మూడు చిత్రాలతో వరుస విజయాలు సాధించి హ్యాట్రిక్ హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్న యువ హీరో శర్వానంద్. వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ...యూత్ లో మంచి గుర్తింపు ఏర్పరుచుకున్నశర్వానంద్ ప్రస్తుతం కెరీర్లో మరచిపోలేని 25వ చిత్రం చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో మూవీస్ చేస్తున్న శర్వానంద్ 25 చిత్రాల ప్రస్ధానం గురించి క్లుప్తంగా మీకోసం...
చిన్నప్పటి నుంచి నటన పై ఉన్న మక్కువతో.. మంచి నటుడుగా పేరు సాధించాలనే ఉద్దేశ్యంతో... ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు శర్వానంద్. అయితే...కెరీర్ ప్రారంభంలో హీరోగా కాకుండా గౌరి, యువసేన, సంక్రాంతి, శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్, క్లాస్ మేట్స్..తదితర చిత్రాల్లో హీరో తమ్ముడుగా, ఫ్రెండ్ గా ముఖ్యపాత్రలు పోషించాడు. ఆతర్వాత వెన్నెల చిత్రంలో హీరోగా నటించిన శర్వానంద్ ప్రస్ధానం, అమ్మ చెప్పింది చిత్రాలతో మంచి నటుడు అనిపించుకున్నాడు. ఇక శర్వానంద్ కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం అంటే గమ్యం. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన గమ్యం చిత్రంలో శర్వానంద్, అల్లరి నరేష్ కలిసి నటించారు. ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొంది డైరెక్టర్ క్రిష్, హీరోలు శర్వానంద్, అల్లరి నరేష్ లకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది.
గమ్యం తర్వాత ప్రస్ధానం, జర్నీ చిత్రాలు శర్వానంద్ కు మంచి విజయాన్ని అందించాయి. ఆతర్వాత శర్వానంద్ నటించిన రాజు మహరాజు, అందరి బంధువయ, కో అంటే కోటి చిత్రాలు ఆశించిన విజయాలు అందుకోలేకపోయాయి. దీంతో ఆలోచనలో పడ్డ శర్వానంద్..రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా డిఫరెంట్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసాడు. అలా..సెలెక్ట్ చేసిన చిత్రమే రన్ రాజా రన్. నూతన దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో రూపొందిన రన్ రాజా రన్ యూత్ ను ఆకట్టుకుని శర్వానంద్ కి కమర్షియల్ విజయాన్ని అందించింది. ఆతర్వాత క్రాంతి మాధవ్ దర్శకత్వంలో శర్వానంద్ నటించిన చిత్రం మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు. మనసును హత్తుకునే విభిన్న ప్రేమకథా చిత్రంగా రూపొందిన మళ్లీ మళ్లీ ఇది రాని రోజు శర్వానంద్ కెరీర్ లో మరచిపోలేని చిత్రంగా నిలిచింది. రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు తర్వాత శర్వానంద్ నటించిన చిత్రం ఎక్స్ ప్రెస్ రాజా. సంక్రాంతి కానుకగా రిలీజైన ఎక్స్ ప్రెస్ రాజా పెద్ద సినిమాల పోటీ ఉన్నప్పటికీ కమర్షియల్ విజయం సాధించడం విశేషం. రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఎక్స్ ప్రెస్ రాజా...ఇలా వరుసగా మూడు చిత్రాలతో విజయాలు సాధించి హ్యాట్రిక్ హీరోగా శర్వానంద్ ఇటు ఇండస్ట్రీలో, అటు ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఏర్పరుచుకున్నాడు.
ఈ హ్యాట్రిక్ హీరో శర్వానంద్ నటిస్తున్న 25వ చిత్రం ఇటీవల ప్రారంభమైంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన సీనియర్ నిర్మాత బి వి ఎస్ ఎన్ ప్రసాద్, హ్యాట్రిక్ హీరో శర్వానంద్ తో 25వ సినిమా ని నిర్మిస్తున్నారు . విన్నూత్నమైన కథల తో, మంచి నటన తో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న శర్వానంద్, ఇంతకుముందు ఎన్నడూ చేయని ఒక వినోదభరితమైన పోలీస్ పాత్రలో ఈ చిత్రం లో కనిపిస్తారు. శర్వ సరసన లావణ్యా త్రిపాఠి హీరోయిన్ గా కనిపించే ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు చంద్రమోహన్ తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ ప్రారంభం అయిన ఈ చిత్రం విజయవంతం గా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. రెండవ షెడ్యూల్ ఈ నెల 15 నుండి ప్రారంభించనున్నారు. రొమాన్స్, కామెడీ ,యాక్షన్...ఇలా ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలతో రూపొందుతున్నఈ చిత్రంతో శర్వానంద్ ఘన విజయం సాధిస్తాడని ఆశిస్తూ...ఆల్ ది బెస్ట్ టు హ్యాట్రిక్ హీరో శర్వానంద్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments