రాజమౌళి కోసం ప్రత్యేక సదుపాయం...
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్లో రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన భారీ సెట్లో ఈ నెల 19 నుండి యాక్షన్ పార్ట్‌తో చిత్రీకరణను స్టార్ట్ చేయబోతున్నారు.
షూటింగ్ స్పాట్‌కు త్వరగా చేరుకునేలా అక్కడే పాత కాలపు పద్ధతుల్లో ఓ ఆఫీస్ సెట్‌ను వేశారట ఆర్ట్ డిపార్ట్మెంట్. దీని కోసం చాలా పెద్ద స్థలాన్ని కేటాయించుకున్నారు.
సినిమా సంబంధిత విషయాలను చర్చించుకోవడానికి వీలుగా ఓ స్థలంతో పాటు.. లీడ్ ఆర్టిస్టులకు శిక్షణ ఇవ్వడం కోసం ఓ ప్లేస్.. అందరూ కలిసి భోజనం చేసేలా రూమ్‌ను డిజైన్ చేసుకున్నారట. ఈ సినిమా కోసం దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్‌ను కేటాయించాడు నిర్మాత దానయ్య డి.వి.వి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments