ఒక రకంగా నేనే వారికి శాపమేమో.. ఫీలయిన ఎస్పీబీ
Send us your feedback to audioarticles@vaarta.com
గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఔన్నత్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సుప్రసిద్ధ గాయకుడిగా ఆయన ఎక్కని మెట్టంటూ లేదు. ఎన్నో అవార్డులు ఆయన ప్రతిభకు తార్కాణంగా నిలిచాయి. పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలు సైతం ఆయనను వరించాయి. అయితే బాలు చెల్లి శైలజ, కుమారుడు ఎస్పీ చరణ్ మాత్రం ఆయనంత స్థాయిలో రాణించలేక పోయారు. శైలజ మంచి పేరు సాధించినప్పటికీ.. చరణ్ మాత్రం పెద్దగా గుర్తింపు పొందలేదు. అయితే దీనిపై ఓ ఇంటర్వ్యూలో బాలు మాట్లాడుతూ శైలజకు మంచి గాయనిగా 75 మార్కులు వేస్తానని తెలిపారు.
అయితే మిగిలినవారిని ప్రోత్సహించినట్లు శైలజను, తన కుమారుడిని తాను ప్రోత్సహించలేదని తన సతీమణి ఆరోపిస్తుంటారని బాలు వెల్లడించారు. ఒక రకంగా తానే వారికి శాపమేమో అని బాలు ఫీలయ్యారు. తన పిల్లలకు బాలు చాలా ఆసక్తికరమైన పేర్లు పెట్టారు. పేర్లు ఆసక్తికరమేమీ కాదు కానీ.. ఆ పేర్లు పెట్టడం వెనుక బాలు ఇంటెన్షన్ మాత్రం ఆసక్తికరమే. తన పాటలోని పల్లవి, చరణాలను తన పిల్లలకు బాలు పేర్లుగా పెట్టుకోవడం విశేషం. కుమారుడికి చరణ్(ణం) అని.. కుమార్తెకు పల్లవి అని పేరు పెట్టారు.
ఇక తన పిల్లల గురించి బాలు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమ్మాయి గృహిణి అని.. బాధ్యతల వల్ల పాడడం మానేసిందని తెలిపారు. తన కుమారుడు బిజినెస్ మేనేజ్మెంట్ చేశాడన్నారు. అయితే.. సంగీతం.. నటన... సినిమాలు తీస్తా అన్నాడని పేర్కొన్నారు. 5 సినిమాలు తీశాడని... 11 కోట్లు పోయాయని వెల్లడించారు. ఇంకా సినిమాలు తీసే పనిలో ఉన్నాడని... బాగా కృషి చేస్తున్నాడని వెల్లడించారు. తన కుమారుడికీ, కుమార్తెకూ ఇద్దరికీ కూడా కవలపిల్లలు అని బాలు తెలిపారు. అది తెలిసి తనను కొందరు ‘కవలల తాతయ్య’ అని పిలుస్తుంటారని వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com