Spark: ఐస్ ల్యాండ్ బ్యూటీఫుల్ లొకేషన్స్‌లో ‘స్పార్క్’ పాట చిత్రీకరణ పూర్తి..
Send us your feedback to audioarticles@vaarta.com
విక్రాంత్ హీరోగా పరిచయమవుతున్న భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పార్క్’. ఛార్మింగ్ బ్యూటీస్ మెహ్రీన్ ఫిర్జాదా, రుక్సర్ థిల్లాన్ ఇందులో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రతి నాయకుడిగా ‘మిన్నల్ మురళి’ ఫేమ్ గురు సోమ సుందరం నటిస్తున్నారు. డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్ అన్‌కాంప్రైజ్డ్‌గా సినిమాను రూపొందిస్తోంది. అనౌన్స్‌మెంట్ రోజునే అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ నుంచి వస్తోన్న అనౌన్స్‌మెంట్స్ ఈ అంచనాలను మరింతగా పెంచుతున్నాయి.
తాజాగా ఐస్ ల్యాండ్‌లోని బ్యూటీఫుల్ లొకేషన్స్‌లో స్పార్క్ మూవీకి సంబంధించిన రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణను పూర్తి చేశారు. అద్భుతమైన విజువల్స్‌తో చిత్రీకరించిన ఈ పాట ప్రేక్షకులకు కనుల విందు చేయనుంది. స్పార్క్ చిత్రం ద్వారా అరవింద్ కుమార్ రవి వర్మ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రవి వర్మ ఇంతకు మునుపు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశారు కాబట్టి సినిమాటోగ్రఫీని కూడా హ్యాండిల్ చేస్తున్నారు.
‘హృదయం’ ఫేమ్ హేషమ్ అబ్దుల్ వాహబ్ ఈ సినిమాకు ట్యూన్స్ అందిస్తున్నారు. ఇప్పటికే ఆడియన్స్ లో పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తోంది స్పార్క్. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో కీ రోల్స్ కోసం రీసెంట్‌గా వెర్సటైల్ ఆర్టిస్ట్ నాజర్, సుహాసిని మణిరత్నం జాయిన్ అయ్యారు. వీరితో పాటు వెన్నెల కిశోర్, షాయాజీ షిండే, సత్య, శ్రీకాంత్, కిరణ్ అయ్యంగార్, అన్నపూర్ణమ్మతో పాటు పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments