Spark: ఐస్ ల్యాండ్ బ్యూటీఫుల్ లొకేషన్స్‌లో ‘స్పార్క్’ పాట చిత్రీకరణ పూర్తి..

  • IndiaGlitz, [Friday,October 28 2022]

విక్రాంత్ హీరోగా ప‌రిచ‌య‌మవుతున్న భారీ బ‌డ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పార్క్’. ఛార్మింగ్ బ్యూటీస్‌ మెహ్రీన్ ఫిర్జాదా, రుక్స‌ర్ థిల్లాన్ ఇందులో హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ప్రతి నాయ‌కుడిగా ‘మిన్నల్ మురళి’ ఫేమ్ గురు సోమ సుందరం నటిస్తున్నారు. డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్ అన్‌కాంప్రైజ్డ్‌గా సినిమాను రూపొందిస్తోంది. అనౌన్స్‌మెంట్ రోజునే అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోన్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ నుంచి వస్తోన్న అనౌన్స్‌మెంట్స్ ఈ అంచనాలను మరింతగా పెంచుతున్నాయి.

తాజాగా ఐస్ ల్యాండ్‌లోని బ్యూటీఫుల్ లొకేషన్స్‌లో స్పార్క్ మూవీకి సంబంధించిన రొమాంటిక్ సాంగ్‌ చిత్రీకరణను పూర్తి చేశారు. అద్భుతమైన విజువల్స్‌తో చిత్రీకరించిన ఈ పాట ప్రేక్షకులకు కనుల విందు చేయనుంది. స్పార్క్ చిత్రం ద్వారా అరవింద్‌ కుమార్‌ రవి వర్మ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రవి వర్మ ఇంతకు మునుపు ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశారు కాబట్టి సినిమాటోగ్రఫీని కూడా హ్యాండిల్‌ చేస్తున్నారు.

‘హృద‌యం’ ఫేమ్‌ హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ ఈ సినిమాకు ట్యూన్స్ అందిస్తున్నారు. ఇప్పటికే ఆడియన్స్ లో పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ చేస్తోంది స్పార్క్. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో కీ రోల్స్ కోసం రీసెంట్‌గా వెర్సటైల్ ఆర్టిస్ట్ నాజ‌ర్‌, సుహాసిని మ‌ణిర‌త్నం జాయిన్ అయ్యారు. వీరితో పాటు వెన్నెల కిశోర్, షాయాజీ షిండే, సత్య, శ్రీకాంత్‌, కిరణ్‌ అయ్యంగార్‌, అన్నపూర్ణమ్మతో పాటు పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

More News

BiggBoss: ఇనయా కత్తిపోటు.. ఊసరవెల్లి లాంటిదంటూ శ్రీహాన్ ఫైర్, కొత్త కెప్టెన్ అతడే

నిన్న మొన్నటి వరకు పరమ బోర్ కొట్టిన బిగ్‌బాస్ 6 తెలుగు సీజన్ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది.

Comedian ali : మూడున్నరేళ్ల నిరీక్షణ, అలీని కరుణించిన జగన్.. ఏపీ ప్రభుత్వంలో కీలక పదవి

కమెడియన్ అలీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కరుణ చూపారు.

Megha Akash: మేఘా ఆకాష్ "మాటే మంత్రము" ఫస్ట్ లుక్ రిలీజ్

రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న సినిమా "మాటే మంత్రము". ఈ చిత్రాన్ని మేఘ ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పిస్తున్నారు.

BiggBoss: అమ్మో... ఇంత కన్నింగా, ఒక్క చేపతో ఆటను మలుపు తిప్పిన గీతూ

బిగ్‌బాస్ 6 సీజన్ ప్రారంభమయ్యాక తొలి రెండు వారాల పాటు వన్ మాన్ షో చేసింది గీతూ.

డిసెంబర్లో విడుదల కానున్న '18 పేజీస్'

ఇటీవలే కార్తికేయ-2 సినిమాతో హిట్ అందుకున్న నిఖిల్ సిద్ధార్థ మరియు అనుపమ పరమేశ్వరన్ మరోసారి 18 పేజీస్ సినిమాకి జతకట్టారు. ఈ నాస్టాల్జిక్ రొమాన్స్‌ని పుష్ప దర్శకుడు సుకుమార్ రాశారు.