అందరి దృష్టి ఇటే!... నేడే స్పార్క్ ఓటీటీ ప్రారంభం!
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా సెకండ్ వేవ్ వినోద రంగంలో ఓటీటీ విస్తరణకు మరో మంచి అవకాశం కల్పించింది. ఇప్పటికే ఈ రంగంలో కొనసాగుతున్న ఓటీటీ వేదికలకు పెను సవాల్ విసురుతూ ‘స్పార్క్ ఓటీటీ’ గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తోంది. యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్త సాగర్ మాచనూరు నేతృత్వంలో రంగంలోకి దిగబోతున్న స్పార్క్ ఓటీటీ ఇప్పటికే పెను సంచలనంగా మారడంతో పాటుగా.. ఈ రంగంలో మరో దిగ్గజ సంస్థగా మారనుందని పేరు తెచ్చుకుంది.
ఈ సందర్భంగా సంస్థ అధినేత సాగర్ మాచనూరు (Sagar Machanuru) మాట్లాడుతూ ‘ఇళ్లల్లోనే కూర్చుని వినోదాన్ని ఆస్వాదించే ప్రేక్షకులకు పూర్తి స్థాయి సంతృప్తిని ఇచ్చేందుకు పక్కా పథకాలతో వస్తున్నాం. అన్ని రకాల ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లుగా కథా కథనాల ఎంపిక చేసే అత్యున్నత సాంకేతికత కలిగిన బృందం మా సొంతం. ఈ బృందం ఇటు ఒరిజినల్స్ తో పాటు అటు బ్లాక్ బస్టర్ చిత్రాలను ఐదు భాషల్లోనూ అందిస్తాం’ అని చెప్పారు.
స్పార్క్ ఓటీటీ (Spark OTT) కోసం ఆ సంస్థ అధినేత సాగర్ మాచనూరు రూపొందించిన ప్రణాళికను చూసి ప్రముఖ దర్శక నిర్మాత రాంగోపాల్ వర్మ ముగ్ధుడయ్యారు. ఈ కారణంగానే తన కొత్త చిత్రం డీ కంపెనీ (దావూద్ ఇబ్రహీం జీవిత కథ)ను స్పార్క్ ఓటీటీ వేదికపై తొలి స్ట్రీమింగ్ సినిమాగా ప్రదర్శించేందుకు ఒప్పుకున్నారు. స్పార్క్ ఓటీటీ ఈ నెల 15 (నేటి అర్ధరాత్రి) నుంచి అందుబాటులోకి రానుంది.
డీ కంపెనీతో పాటు ఇతరత్రా ఆసక్తికర సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు ‘దిశ ఎన్ కౌంటర్’, సునీల్ రూపొందించిన ‘కనబడుటలేదు’, క్యాబ్ స్టోరీస్, వర్మ రూపొందించనున్న ‘ఇది మహాభారతం కాదు’, దేశంలోనూ తొలి లెస్బియన్ క్రైమ్, యాక్షన్ చిత్రం ‘డేంజరస్’, ఆర్జీవీ మిస్సింగ్, టాబ్లెట్, రామూఇజమ్ సిరీస్ విత్ స్వప్న.. తదితరాలు స్పార్క్ ఓటీటీలో అందుబాటులోకి (OTT Platform) రానున్నాయి.
'స్పార్క్' ఓటీటీ యాప్ ఇన్‌స్టాల్ చేయండి.. నెక్స్ట్ లెవల్ ఎంటర్టైన్మెంట్ కోసం సిద్ధంగా ఉండండి:
iOS కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://apps.apple.com/in/app/spark-ott-movies-originals/id1548436838
Android కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://play.google.com/store/apps/details?id=com.theally.sparkapp
తాజా సినిమాలు, వెబ్ సిరీస్ & ఒరిజినల్స్ కోసం చూడండి: https://www.sparkott.com/
Press release by: Indian Clicks, LLC
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments