అంద‌రి దృష్టి ఇటే!... నేడే స్పార్క్ ఓటీటీ ప్రారంభం!

  • IndiaGlitz, [Friday,May 14 2021]

క‌రోనా సెకండ్ వేవ్ వినోద రంగంలో ఓటీటీ విస్త‌ర‌ణ‌కు మ‌రో మంచి అవ‌కాశం కల్పించింది. ఇప్ప‌టికే ఈ రంగంలో కొన‌సాగుతున్న ఓటీటీ వేదిక‌ల‌కు పెను స‌వాల్ విసురుతూ ‘స్పార్క్ ఓటీటీ’ గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తోంది. యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్త సాగర్ మాచనూరు నేతృత్వంలో రంగంలోకి దిగ‌బోతున్న స్పార్క్ ఓటీటీ ఇప్ప‌టికే పెను సంచ‌ల‌నంగా మారడంతో పాటుగా.. ఈ రంగంలో మ‌రో దిగ్గ‌జ సంస్థ‌గా మార‌నుంద‌ని పేరు తెచ్చుకుంది.

ఈ సంద‌ర్భంగా సంస్థ అధినేత సాగ‌ర్ మాచ‌నూరు (Sagar Machanuru) మాట్లాడుతూ ‘ఇళ్ల‌ల్లోనే కూర్చుని వినోదాన్ని ఆస్వాదించే ప్రేక్ష‌కుల‌కు పూర్తి స్థాయి సంతృప్తిని ఇచ్చేందుకు ప‌క్కా ప‌థ‌కాల‌తో వ‌స్తున్నాం. అన్ని ర‌కాల ప్రేక్ష‌కుల అభిరుచుల‌కు త‌గ్గ‌ట్లుగా క‌థా క‌థ‌నాల ఎంపిక చేసే అత్యున్న‌త సాంకేతికత క‌లిగిన బృందం మా సొంతం. ఈ బృందం ఇటు ఒరిజిన‌ల్స్ తో పాటు అటు బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను ఐదు భాష‌ల్లోనూ అందిస్తాం’ అని చెప్పారు.

స్పార్క్ ఓటీటీ (Spark OTT) కోసం ఆ సంస్థ అధినేత సాగ‌ర్ మాచ‌నూరు రూపొందించిన ప్ర‌ణాళిక‌ను చూసి ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత రాంగోపాల్ వ‌ర్మ ముగ్ధుడ‌య్యారు. ఈ కార‌ణంగానే త‌న కొత్త చిత్రం డీ కంపెనీ (దావూద్ ఇబ్ర‌హీం జీవిత క‌థ‌)ను స్పార్క్ ఓటీటీ వేదిక‌పై తొలి స్ట్రీమింగ్ సినిమాగా ప్ర‌ద‌ర్శించేందుకు ఒప్పుకున్నారు. స్పార్క్ ఓటీటీ ఈ నెల 15 (నేటి అర్ధ‌రాత్రి) నుంచి అందుబాటులోకి రానుంది.

డీ కంపెనీతో పాటు ఇత‌ర‌త్రా ఆస‌క్తిక‌ర సినిమాల‌తో పాటు వెబ్ సిరీస్ లు ‘దిశ ఎన్ కౌంట‌ర్‌’, సునీల్ రూపొందించిన ‘క‌న‌బడుట‌లేదు’, క్యాబ్ స్టోరీస్‌, వ‌ర్మ రూపొందించ‌నున్న ‘ఇది మ‌హాభార‌తం కాదు’, దేశంలోనూ తొలి లెస్బియన్ క్రైమ్, యాక్షన్ చిత్రం ‘డేంజరస్’, ఆర్జీవీ మిస్సింగ్, టాబ్లెట్, రామూఇజమ్ సిరీస్ విత్ స్వప్న.. తదితరాలు స్పార్క్ ఓటీటీలో అందుబాటులోకి (OTT Platform) రానున్నాయి.

'స్పార్క్' ఓటీటీ యాప్ ఇన్‌స్టాల్ చేయండి.. నెక్స్ట్ లెవల్ ఎంటర్టైన్మెంట్ కోసం సిద్ధంగా ఉండండి:

iOS కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://apps.apple.com/in/app/spark-ott-movies-originals/id1548436838

Android కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://play.google.com/store/apps/details?id=com.theally.sparkapp

తాజా సినిమాలు, వెబ్ సిరీస్ & ఒరిజినల్స్ కోసం చూడండి: https://www.sparkott.com/

Press release by: Indian Clicks, LLC

More News

జర్నలిస్టుల కోసం సుప్రీంకోర్టు ప్రత్యేక యాప్

కరోనా మహమ్మారి దేశంలో ప్రవేశించిన అనంతరం కార్యక్రమాలన్నీ ఆన్‌లైన్‌కు షిఫ్ట్ అయిపోయిన విషయం తెలిసిందే.

అరేబియాలో సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం.. తుపాను అలర్ట్‌

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ నెల 16, 17 తేదీల్లో తుపాను ప్రభావం ఉండే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

హైకోర్టు చెప్పినా వినరా? అంబులెన్స్‌లను అడ్డుకున్న పోలీసులు.. 

ఏపీ- తెలంగాణ సరిహద్దుల్లో పేచీ మళ్లీ మొదటికి వచ్చింది. అంబులెన్స్‌లను ఆపడం మానవత్వమేనా?

ఆ తల్లి ఆవేదనకు కన్నీళ్లు పెడుతున్న నెటిజన్లు

పిల్లలు ఎటు వెళ్లొచ్చినా.. ఇంటికి రాగానే అమ్మ కోసమే వెదుక్కుంటారు. పెద్దవాళ్లైన తర్వాత కూడా దీనిలో మార్పైతే ఏమీ ఉండదు.

కరోనా నుంచి కోలుకున్నవారు టీకా కోసం 6 నెలలు ఆగాల్సిందే..

ప్రస్తుతం భారత్‌లో రెండు రకాల టీకాలను ప్రజలకు ఇస్తున్న విషయం తెలిసిందే. కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను ప్రజానీకానికి అందజేస్తోంది.