అంతరిక్ష నేపథ్యం..రూ.25 కోట్లు
Send us your feedback to audioarticles@vaarta.com
ఘాజీ` సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని తన వైపు తిప్పుకున్న నవతరం దర్శకుడు సంకల్ప్ రెడ్డి. జలాంతర్గామి యుద్ధం నేపథ్యంతో.. తక్కువ ఖర్చుతో ఈ సినిమాని తెరకెక్కించి.. నిర్మాతలకు పెద్ద విజయాన్ని అందించిన ఘనత ఈ డైరెక్టర్‌ది. ఈసారి అంతరిక్ష నేపథ్యంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు సంకల్ప్. అంతేకాకుండా.. ఈ సినిమాలో మెగా హీరో వరుణ్ తేజ్‌ని కథానాయకుడిగా ఎంపిక చేసుకున్నారు సంకల్ప్ రెడ్డి.
అలాగే ఈ చిత్రానికి సంబంధించి అవసరమైన శిక్షణను కూడా తీసుకోమని వరుణ్ తేజ్‌కి ఆయన చెప్పినట్లు సమాచారం. అంతరిక్ష నేపథ్యంతో సినిమా అంటే బడ్జెట్ కూడా భారీగానే ఉంటుందని నిర్మాతలు భావించారు. కాని సంకల్ప్ రెడ్డి కేవలం రూ. 25కోట్లతో సినిమాని తెరకెక్కించేందుకు ప్లాన్ చేశారని ఇన్‌సైడ్ సోర్స్ టాక్. ఇదే అంతరిక్ష నేపథ్యంతో 'జయం' రవి హీరోగా టిక్ టిక్ టిక్` పేరుతో రూపొందిన తమిళ సినిమా.. ఈ నెల 26న విడుదలకి సిద్ధమవుతోంది. మరి.. ఈ నేపథ్యంలో ఘాజీ` డైరెక్టర్ తన అప్ కమింగ్ ప్రాజెక్టుని ఎటువంటి ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కిస్తారోనని ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments