నాన్నగారికి ప్రమాదమేమీ లేదని వైద్యులంటున్నారు: ఎస్పీ చరణ్
- IndiaGlitz, [Monday,August 17 2020]
గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై ఆయన తనయుడు చరణ్ తాజా అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం బాలు ఆరోగ్యం నిన్నటి లాగే ఉందని.. ఏమీ మార్పు లేదని వైద్యులు చెబుతున్నారని చరణ్ వెల్లడించారు. ‘‘నాన్న గారి ఆరోగ్యం నిన్న ఎలాగైతే ఉందో అలాగే ఉంది. వైద్యులు కూడా క్రిటికల్‌గానే ఉందని చెబుతున్నారు. కానీ నిలకడగా ఉంది. ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు. డాక్టర్లు కూడా ప్రమాదమేమీ లేదంటున్నారు. మీరంతా చూపిస్తున్న ప్రేమాభిమానాల కారణంగా ఆయన క్షేమంగా తిరిగి వస్తారు’’ అని చరణ్ తెలిపారు.
కరోనా బారిన పడిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం ఇటీవల విషమించడంతో ఆయనను ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్సను అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఎంజీఎం హెల్త్ కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆయన కోలుకోవాలని దేశం మొత్తం ఆకాక్షిస్తోంది. చిరంజీవి, రజినీకాంత్, కమల్ హాసన్, ఖుష్బూ తదితర సెలబ్రిటీలంతా ట్విట్టర్ వేదికగా బాలు ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.
తాజాగా ప్రధాని కార్యాలయ అధికారులు బాలు ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసినట్టు తెలుస్తోంది. బాలు చికిత్సకు సంబంధించిన వివరాల గురించి ఆస్పత్రి యాజమాన్యంతో ప్రధాని కార్యాలయం మాట్లాడినట్టు తెలుస్తోంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం బాలు ఆరోగ్యంపై ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడినట్టు సమాచారం. అలాగే ప్రభుత్వం తరఫున తమిళనాడు సీఎం పళని స్వామి కూడా ఎప్పటికప్పుడు బాలు చికిత్సకు సంబంధించిన వివరాలను తెలుసుకుంటున్నట్టు తెలుస్తోంది.
View this post on InstagramA post shared by S. P. Charan/Producer/Director (@spbcharan) on Aug 17, 2020 at 3:33am PDT