దుష్ప్రచారం వద్దు... ప్రెస్‌మీట్ పెడతా!
Send us your feedback to audioarticles@vaarta.com
లెజెండ్రీ సింగర్, గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం కరోనా వైరస్ కారణంగా చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆంత్యక్రియలు ముగిసిన తర్వాత.. కొందరు బాలసుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేలా రూమర్స్‌ను క్రియేట్ చేశారు. ఎంజీఎం హాస్పిటల్‌కు, బాలు కుటుంబానికి మధ్య హాస్పిటల్ బిల్‌కు సంబంధించిన గొడవ జరిగిందని, చణ్ విషయాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వరకు తీసుకెళ్తే.. ఆయన బిల్లు కట్టాడని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. దీనిపై బాలసుబ్రహ్మణ్యం తనయుడు చరణ్ స్పందించారు.
''కొందరు కావాలనే నాన్న హాస్పిటల్ బిల్‌కు సంబంధించిన మాకు, ఆసుపత్రి వర్గాలకు మధ్య గొడవ జరిగిందని, చివరకు వెంకయ్యనాయుడుగారు సెటిల్ చేశారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారనేది నాకు తెలియడం లేదు. అయితే నాన్నకు సంబంధించిన విషయంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. డాక్టర్స్ ఎంతగానో సపోర్ట్ చేశారు. మెరుగైన వైద్యం అందించారు. ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో వారికి నిజానిజాలు తెలియవు. కాబట్టి హాస్పిటల్ మేనేజ్మెంట్తో చర్చించి అభిమానులందరికీ వివరిస్తూ ఓ ప్రెస్‌మీట్ పెట్టాలని అనుకుంటున్నాను" అన్నారు ఎస్.పి.చరణ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com