అదంతా పుకారు.. ఇంకా నాన్నగారు లైఫ్ సపోర్ట్‌పైనే ఉన్నారు: ఎస్పీ చరణ్
Send us your feedback to audioarticles@vaarta.com
గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వచ్చిన ప్రకటన అబద్ధమని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ తెలిపారు. ఎస్పీ బాలుకి తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షలో నెగిటివ్ వచ్చిందన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. తన తండ్రి ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తనే అందిస్తానని వెల్లడించారు. ప్రస్తుతం తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ఆయన కోలుకునేందుకు అది సహకరిస్తుందని భావిస్తున్నానని చెబుతూ చరణ్ ఓ వీడియో విడుదల చేశారు.
‘‘ఎంజీఎం ఆసుప్రతికి సంబంధించిన మెడికల్ టీంను సంప్రదించిన అనంతరమే నేను సాధారణంగా నా తండ్రి హెల్త్ అప్‌డేట్‌ను ఇస్తుంటాను. కానీ దురదృష్టవశాత్తు ఉదయం నుంచి ఓ పుకారు షికారు చేస్తోంది. నాన్నగారి ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ అయినా నేనే ఇస్తూ ఉంటాను. కానీ ఇవాళ నాన్నగారికి కరోనా నెగిటివ్ వచ్చిందంటూ ఓ రూమర్ వైరల్ అవుతోంది. నాన్నగారికి కరోనా నెగిటివా? పాజిటివా? అనేది పక్కనబెడితే.. ఆయన లైఫ్ సపోర్ట్ పైనే ఆధారపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. అది కోలుకునేందుకు ఇది సహకరిస్తుందని భావిస్తున్నా’’ అని ఎస్పీ చరణ్ తెలిపారు.
కాగా.. సోమవారం ఉదయం ఎస్పీ చరణ్ పేరిట విడుదలైన ప్రకటన ఆయన పీఆర్వో నిఖిల్ విడుదల చేశారు. ఎస్పీ బాలుకి కరోనా నెగిటివ్ వచ్చిందని ఫేస్‌బుక్ వేదికగా ప్రకటనను విడుదల చూశారు. దీంతో ఎస్పీ బాలు అభిమానులంతా సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఎస్పీ బాలుకి కరోనా నెగిటివ్ అని వెల్లడించిన పీఆర్వో నిఖిలే తిరిగి ఎస్పీ చరణ్ వీడియోను కూడా విడుదల చేయడం గమనార్హం. ఎస్పీబీ అభిమానులంతా సంతోషించిన కాసేపటికే అదంతా పుకారేనంటూ ఈ వీడియో విడుదల కావడంతో నిరుత్సాహానికి గురయ్యారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments