అదంతా పుకారు.. ఇంకా నాన్నగారు లైఫ్ సపోర్ట్‌పైనే ఉన్నారు: ఎస్పీ చరణ్

  • IndiaGlitz, [Monday,August 24 2020]

గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వచ్చిన ప్రకటన అబద్ధమని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ తెలిపారు. ఎస్పీ బాలుకి తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షలో నెగిటివ్ వచ్చిందన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. తన తండ్రి ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తనే అందిస్తానని వెల్లడించారు. ప్రస్తుతం తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ఆయన కోలుకునేందుకు అది సహకరిస్తుందని భావిస్తున్నానని చెబుతూ చరణ్ ఓ వీడియో విడుదల చేశారు.

‘‘ఎంజీఎం ఆసుప్రతికి సంబంధించిన మెడికల్ టీంను సంప్రదించిన అనంతరమే నేను సాధారణంగా నా తండ్రి హెల్త్ అప్‌డేట్‌ను ఇస్తుంటాను. కానీ దురదృష్టవశాత్తు ఉదయం నుంచి ఓ పుకారు షికారు చేస్తోంది. నాన్నగారి ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ అయినా నేనే ఇస్తూ ఉంటాను. కానీ ఇవాళ నాన్నగారికి కరోనా నెగిటివ్ వచ్చిందంటూ ఓ రూమర్ వైరల్ అవుతోంది. నాన్నగారికి కరోనా నెగిటివా? పాజిటివా? అనేది పక్కనబెడితే.. ఆయన లైఫ్ సపోర్ట్ పైనే ఆధారపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. అది కోలుకునేందుకు ఇది సహకరిస్తుందని భావిస్తున్నా’’ అని ఎస్పీ చరణ్ తెలిపారు.

కాగా.. సోమవారం ఉదయం ఎస్పీ చరణ్ పేరిట విడుదలైన ప్రకటన ఆయన పీఆర్వో నిఖిల్ విడుదల చేశారు. ఎస్పీ బాలుకి కరోనా నెగిటివ్ వచ్చిందని ఫేస్‌బుక్ వేదికగా ప్రకటనను విడుదల చూశారు. దీంతో ఎస్పీ బాలు అభిమానులంతా సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఎస్పీ బాలుకి కరోనా నెగిటివ్ అని వెల్లడించిన పీఆర్వో నిఖిలే తిరిగి ఎస్పీ చరణ్ వీడియోను కూడా విడుదల చేయడం గమనార్హం. ఎస్పీబీ అభిమానులంతా సంతోషించిన కాసేపటికే అదంతా పుకారేనంటూ ఈ వీడియో విడుదల కావడంతో నిరుత్సాహానికి గురయ్యారు.

More News

అధ్యక్షురాలిగా కొనసాగలేనన్న సోనియా... లేఖపై రాహుల్ ఫైర్..

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పాల్గొన్న 48 మంది సీడబ్ల్యూసీ సభ్యులు పాల్గొన్నారు.

ఎస్పీ బాల సుబ్రహ్మణ్యానికి కరోనా నెగిటివ్..

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు, సినీ ఇండస్ట్రీ చేసిన ప్రార్థనలు ఫలించాయి.

భారత్‌లో విజృంభిస్తున్న కరోనా.. వారానికి 4 లక్షల చొప్పున పాజిటివ్ కేసులు

భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా ఆగస్టు నెలలో దేశ వ్యాప్తంగా వైరస్ తీవ్రత భారీగా పెరిగిందన్నారు.

తెలంగాణలో కొత్తగా 1842 కేసులు..

రెండు రోజులుగా తెలంగాణలో కేసుల సంఖ్య 2 వేల మార్కును దాటివేయగా..

షూటింగ్‌కు సిద్దమవుతున్న ప్రభాస్.. సెప్టెంబర్ రెండో వారంలో స్టార్ట్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా సెప్టెంబర్ సెకండ్ వీక్‌లో స్టార్ట్ కాబోతోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో