రేపు సాయంత్రం తామరైపాకంలో బాలు అంత్యక్రియలు..

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు శనివారం సాయంత్రం నిర్వహించనున్నారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో రేపు బాలు అంత్యక్రియలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రెడ్‌హిల్స్‌ సమీపంలోని తామరైపాకంలో శనివారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నారు. ఎంజీఎం నుంచి కోడంబాకంలోని ఎస్పీ చరణ్‌ ఇంటికి బాలు పార్థీవదేహాన్ని తరలించనున్నారు. అభిమానుల సందర్శనార్థం కోడంబాకంలో బాలు పార్థీవదేహాన్ని ఉంచనున్నారు.

కాగా.. గాన గంధర్వుడు లెజెండరీ సింగర్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం శుక్రవారం మధ్యాహ్నం పరమపదించారు. కోట్లాది హృదయాల్లో చిచ్చు పెట్టే ఈ వార్తను బాలు కుమారుడు ఎస్పీ చరణ్ దు:ఖ భరిత హృదయంతో వెల్లడించారు. మధ్యాహ్నం 1.04 గం.కు స్వర్గస్తులైనట్లు చరణ్ మీడియా ఎదుట ప్రకటించారు. నాన్న గారు కోలుకోవాలని ప్రార్థనలు చేసిన కోట్లాదిమంది అభిమానులకు ధన్యవాదాలు అని చరణ్ తెలిపారు. ఈ వార్తతో దేశం మొత్తం దు:ఖ సాగరంలో మునిగిపోయింది.

More News

బాలు, నేనూ శ్రీకాళహస్తిలో చదివాం.. రూ.100 తీసుకున్నా: మోహన్‌బాబు

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం నేడు పరమపదించిన విషయం తెలిసిందే.

చావంటే తెలియకుండా కన్నుమూయాలి: ఎస్పీబీ

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో దాదాపు 40వేల పాటలు పాడారు.

ఎస్పీబీకి కరోనా పాజిటివ్‌ అని తేలినప్పటి నుంచి మినిట్ టు మినిట్

గాన గంధర్వుడు గాన గంధర్వుడు, లెజెండరీ సింగర్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఇక లేరు.

నిన్న సాయంత్రం నుంచే ఎంజీఎం వద్ద మారిపోయిన పరిస్థితులు

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించిందని గురువారం సాయంత్రం ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

చదువుకుంటూనే పాటలు.. 'మర్యాద రామన్న'తో సినీ ప్రస్థానం

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం శుక్రవారం మధ్యాహ్నం 1:04గంటలకు పరమపదించారు. ఆయన పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం.