ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వైద్యుల మాటలకు స్పందిస్తున్నారు: ఎంజీఎం

ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. కొద్ది రోజుల పాటు బాగానే ఉన్న ఆయన ఆరోగ్యం ఇటీవల విషమించిందని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. కాగా.. ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్‌ను తాజాగా ఆసుపత్రి వర్గాలు విడుదల చేశాయి. అయితే ఆయన ఇంకా వెంటిలేటర్, ఎక్మో సహాయంతోనే చికిత్స కొనసాగుతోందని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.

‘‘కరోనాతో బాధపడుతూ ఎంజీఎం హెల్త్ కేర్‌లో చేరిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి వెంటిలేటర్, ఎక్మో సహాయంతో చికిత్సను అందిస్తున్నాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. వైద్యుల మాటలకు ఆయన స్పందిస్తున్నారు. మరోవైపు ఫిజియోథెరపీ కూడా చేయిస్తున్నాం. వైద్య నిపుణుల బృందం ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది’’ అని ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు ప్రకటనలో తెలిపాయి.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ కూడా తన తండ్రి ఆరోగ్య పరిస్థితిని వెల్లడిస్తూ ఓ వీడియో షేర్ చేశారు. ‘‘మా నాన్నగారు స్లోగా కోలుకుంటున్నారు. నిన్నటితో పోలిస్తే ఆయన ఆరోగ్య పరంగా మరికాస్త కోలుకున్నారు. ఇదొక శుభ పరిణామం. వైద్యులు చాలా కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. నాన్నగారి గురించి ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు’’ అని వీడియోలో చరణ్ పేర్కొన్నారు.

More News

‘వ‌కీల్ సాబ్‌’ బ‌ర్త్ డే ట్రీట్ అదేనా..?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ పుట్టిన‌రోజు సెప్టెంబ‌ర్ 2.

ఆదా శర్మ కొత్త సినిమా 'క్వశ్చన్ మార్క్ (?)'

శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకం పై ఆదా శర్మ హీరోయిన్ గా విప్రా దర్శకత్వం లో  గౌరీ కృష్ణ నిర్మాతగా గౌరు ఘనా సమర్పణలో

‘ఆదిపురుష్’ గురించి ప్ర‌భాస్ ప్లాన్‌..!!

ప్యాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ వ‌రుస‌గా క్రేజీ ప్రాజెక్టుల‌ను అనౌన్స్ చేస్తూ వ‌స్తున్నారు. రీసెంట్‌గా బాలీవుడ్ ఓంరావుత్ ద‌ర్శ‌క‌త్వంలో

‘ఆచార్య’ క‌థ రిజిష్ట‌ర్ కాలేదా...!!

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం రీసెంట్‌గా కాపీ రైట్ స‌మ‌స్య‌ను ఎదుర్కొంది.

రియాకు సుశాంత్ సోదరి స్ట్రాంగ్ కౌంటర్..

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు విషయంలో రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది.