ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వైద్యుల మాటలకు స్పందిస్తున్నారు: ఎంజీఎం
Send us your feedback to audioarticles@vaarta.com
ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. కొద్ది రోజుల పాటు బాగానే ఉన్న ఆయన ఆరోగ్యం ఇటీవల విషమించిందని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. కాగా.. ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్‌ను తాజాగా ఆసుపత్రి వర్గాలు విడుదల చేశాయి. అయితే ఆయన ఇంకా వెంటిలేటర్, ఎక్మో సహాయంతోనే చికిత్స కొనసాగుతోందని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.
‘‘కరోనాతో బాధపడుతూ ఎంజీఎం హెల్త్ కేర్‌లో చేరిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి వెంటిలేటర్, ఎక్మో సహాయంతో చికిత్సను అందిస్తున్నాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. వైద్యుల మాటలకు ఆయన స్పందిస్తున్నారు. మరోవైపు ఫిజియోథెరపీ కూడా చేయిస్తున్నాం. వైద్య నిపుణుల బృందం ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది’’ అని ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు ప్రకటనలో తెలిపాయి.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ కూడా తన తండ్రి ఆరోగ్య పరిస్థితిని వెల్లడిస్తూ ఓ వీడియో షేర్ చేశారు. ‘‘మా నాన్నగారు స్లోగా కోలుకుంటున్నారు. నిన్నటితో పోలిస్తే ఆయన ఆరోగ్య పరంగా మరికాస్త కోలుకున్నారు. ఇదొక శుభ పరిణామం. వైద్యులు చాలా కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. నాన్నగారి గురించి ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు’’ అని వీడియోలో చరణ్ పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments