హీరోయిన్ల పై సింగర్ ఎస్పీ బాలు బోల్డ్ కామెంట్స్
Send us your feedback to audioarticles@vaarta.com
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హీరోయిన్స్‌పై బోల్డ్ కామెంట్స్ చేశారు. ఈ మాటలు విన్న సినీ ప్రియులు, నటీనటులు సైతం ఒకింత అవాక్కయ్యారు. బాలు ఏంటి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.
ఇటీవల తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన లెజెండరీ సింగర్ తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హీరోయిన్స్ డ్రెస్సింగ్‌పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
హీరోయిన్స్ డ్రస్సింగ్‌పై..
"ఇంటర్నెట్లో అదీ ఇదీ చూసి వేదిక మీద ఒక స్త్రీ పాత్రదారిణి వచ్చి కూర్చున్నప్పుడు ఎలాంటి బట్టలు వేసుకోవాలి అనే నిర్ణయం కూడా తీసుకోలేని అమాయక పరిస్థితి అనుకోవాలా..? లేకుంటే మరొకటి అనుకోవాలా..?. కేవలం అంగాంగ ప్రదర్శన చేస్తేనే తర్వాత అక్కడ కూర్చున్న నిర్మాతలో, హీరోలు అవకాశాలు ఇస్తారనుకొని వచ్చే స్థితి మన సంస్కారం దిగజారిపోయింది. ఇది నేను గట్టిగానే చెప్పదలుచుకున్నాను. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరికైనా హీరోయిన్లకు నామీద కోపమొచ్చిన పర్లేదు. చాలా మందికి తెలుగు తెలియదు కాబట్టి ఇవన్నీ అర్థం కాకపోవచ్చు.
గతంలో వచ్చిన సినిమాలన్నీ డబ్బులు పెట్టిన తర్వాతే ఇంకొంచెం సంపాదించుకోవాలనే చేస్తారు. కానీ దాని వెనుక ఒక నిబద్ధత, బాధ్యత, సమాజం పట్ట ఒక స్పృహ ఇవన్నీ ఉండేవి" కానీ ఇప్పుడు అలాంటివన్నీ కనుమరగయ్యాయి అన్నట్లుగా ఎస్పీ చెప్పుకొచ్చారు. అయితే బాలు వ్యాఖ్యలపై నటీనటుల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments