పార్టీ మారిన నేతలకు చురకలంటించిన సింగర్ బాలు! 

  • IndiaGlitz, [Wednesday,January 30 2019]

లెజండరీ సింగర్ బాలసుబ్రమణ్యం రాజకీయ నేతలకు గట్టిగానే క్లాస్ పీకారు. తాను చెప్పాల్సిందంతా చెప్పేసి చివర్లో తిన్నగా తనకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదంటూ చెప్పుకొచ్చారు. ఇటీవల తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో లెజెండ‌రీ సింగ‌ర్.. ఎక్కడో హరికథ అని చెప్పి ప్రసంగం ప్రారంభించిన బాలు హీరోయిన్లు, రాజకీయ నేతలు, లా అంటూ ఇంకా చాలా విషయాలపైనే మాట్లాడి సభికులను ఒకింత ఆశ్చర్యపరిచారు. అసలు ఆయన రాజకీయ నేతలను ఏమన్నారు..? లా గురించి ఏమన్నారనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

అరెస్ట్ చేసినోళ్లతో సెల్యూట్లా..!

ఒక నియోజకవర్గంలో ఒక వ్యక్తి 15 హత్యలు చేసి అతనికి యావజ్జీవ ఖైదు విధిస్తే.. 14 ఏళ్లలోపు ఏదో ఒక కారణాల వల్ల జైలు నుంచి బయటికొచ్చేసి ఎవరో ప్రాప్తం సంపాదించి వారికి కాళ్లొత్తి చేతులొత్తి.. ఇంకా చేయకూడని పనులన్నీ చేసి టికెట్ సంపాదించుకుంటున్నారు. అదే నియోజకవర్గంలో నిలబడి గెలిచి ఆ తర్వాత ఎమ్మెల్యేగా నిలబడి, మంత్రి అయ్యి తనను ఎవరు అరెస్ట్ చేశారో వారితో సెల్యూట్ కొట్టించుకునే పరిస్థితి ఇదీ లా.!?. ఇది లా నేనా.. ఎలా కుదురుతుంది ఇదంతా. ఏ చట్టం కూడా ఇదిగో ఇలాగే ఉండాలని ఎక్కడా లేదు ఆ రూల్స్ ఇప్పుడు లేవ్. ఎవరికి సంబంధించింది వాళ్లు అన్వయించుకోని మాట్లాడేస్తున్నారు. ఆ పార్టీ.. ఈ పార్టీ ఇలా నేను రాజీకీయాల జోలికి పోదల్చుకోలేదు. అసలు నేను రాజకీయాలను తెలుసుకోదలుచుకోలేదు. రాజకీయాలకు నేను చాలా దూరంగా ఉంటాను అని చెబుతూనే పరోక్షంగా రాజకీయ నేతలకు గట్టిగానే క్లాస్ పీకారు.

ఇదేంటి పర్మిషన్ అక్కర్లేదా..!

ఒక పార్టీ గుర్తుపై గెలిచినప్పుడు అది బాగుంటుందని వేరో పార్టీలోకి మారడం. అసలు ఆ నేత ఎక్కడ నిలబడి ఏ ప్రజలతో ఓటు వేయించుకున్నాడో వాళ్ల పర్మిషన్ అక్కర్లేదా. ఫలానా పార్టీలో పనిచేస్తే ఇదిగో ఇలా చేయగలను అని అబద్ధమైనా చెప్పవల్సిన ఆవశ్యకం ఉన్నదా లేదా.. ? అసలు ఆ నేతలు కనపడితే చాలా మనం మాత్రం చప్పట్లు కొట్టేస్తున్నాం. ఇవన్నీ నేను సమాజ స్పృహ కోసమే మాట్లాడుతున్నాను అంతే తప్ప ఎవర్నీ టార్గెట్ చేసుకోలేదు అని బాలసుబ్రమణ్యం తన ప్రసంగాన్ని ముగించారు.

అయితే.. బాలు మాటలకు ఫిరాయింపు, రాజకీయ నేతల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాల్సిందే మరి. ఇదిలా ఉంటే బాలు మాటలను పలువురు నెటిజన్లు సమర్థిస్తా హ్యాట్సాప్ చెబుతుండగా.. మరికొందరు రాజకీయ నేతలకు బాగా గడ్డిపెట్టారు సార్ ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. అప్పుడప్పుడు మీలాంటి వాళ్లు పెట్టే గడ్డి వల్ల అయినా రాజకీయ నేతల్లో మార్పు రావాలని మనసారా కోరుకుంటున్నాను సార్ అంటూ బాలు అభిమానులు చెబుతున్నారు.

More News

'సకలకళావల్లభుడు' ఫిబ్రవరి 1న విడుదల

బీరం సుదాకరెడ్డి సమర్పణలో సింహా ఫిలిమ్స్, మరియు దీపాల ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'సకల కళా వల్లభుడు'.

జయంత్ సి పరాన్జీ 'నరేంద్ర' సినిమాలో నటించనున్న WWE రెజ్లింగ్ స్టార్ "ది గ్రేట్ ఖలీ"..!!

ఇండియన్ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్మెంట్ (WWE) రెజ్లర్ 'ది గ్రేట్ ఖలీ' టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం అయ్యింది.. ప్రముఖ దర్శకుడు జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో

జనసేనలో ఎందుకు చేరాలి.. హేమ షాకింగ్ కామెంట్స్!

టైటిల్ చూడగానే.. ఇదేంటి ఈ మాటలు అన్నది నిజంగానే సినీ నటి హేమేనా..?

ఇదే జరిగితే నెల్లూరులో వైసీపీ ఖాళీ..!?

ఎన్నికల ముందు వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగలనుందా..? కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో వైసీపీ ఖాళీ కానుందా..?

ఉండవల్లికి ఉన్న విలువ చంద్రబాబుకు లేదా..!?

ఏపీలో మాజీ ఎంపీ ఉండవల్లికి ఉన్నంత విలువ.. సీఎం చంద్రబాబుకు లేదా..? అంటే అవుననే అంటున్నాయి కొన్ని ఏపీ ప్రాంతీయ పార్టీలు.