లెజండరీ సింగర్ ఎస్పీ బాలు ఇంట విషాదం
- IndiaGlitz, [Monday,February 04 2019]
లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇంట విషాదం నెలకొంది. బాలు తల్లి శకుంతలమ్మ (89)కు సోమవారం ఉదయం 7గంటలకు స్వగ్రామం నెల్లూరులో తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది.
శకుంతలమ్మ మరణంతో బాలు కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆమె మృతికి సంతాపం తెలిపారు. మరో వైపు బాలు అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపి.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
లండన్ నుంచి బాలు పయనం..!
విషయం తెలుసుకున్న ఎస్పీ బాలు హుటాహుటిన లండన్ నుంచి స్వగ్రామానికి బయల్దేరారు. ఇవాళ సాయంత్రానికి ఆయన నెల్లూరు చేరుకోనున్నారని తెలుస్తోంది. రేపు అనగా మంగళవారం ఉదయం నెల్లూరులోని ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.