చావంటే తెలియకుండా కన్నుమూయాలి: ఎస్పీబీ

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో దాదాపు 40వేల పాటలు పాడారు. ఇంతకంటే ఎవరూ బాగా పాడలేరు అనిపిస్తుంది ఆయన పాట వింటే... అనిపించడం కాదు.. అది అక్షర సత్యం కూడా.. బాలు చిన్నతనంలో ఆయన తండ్రి సాంబమూర్తి... చదువు కావాలా.? పాట కావాలా..? అని ప్రశ్నిస్తే పాటనే ఎంచుకున్నారట.. పాటంటే అంతటి ప్రాణం ఆయనకు. దీంతో ఇంజనీరింగ్‌ను మధ్యలోనే వదిలేసి సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో తన గురించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఆ ఇంటర్వ్యూలో మీ చివరి కోరిక ఏంటి? అన్న ప్రశ్నకు బాలు ఇచ్చిన సమాధానం కన్నీరు తెప్పిస్తుంది. ‘చావంటే తెలియకుండా కన్నుమూయాలి.. ఓపిక ఉన్నంతవరకు పాడుతుండాలి’ అని.. ఇదే తన చివరి కోరికగా పేర్కొన్నారు. ‘శ్రుతిలయలే జననీ జనకులు కాగా..’ అనే పాట తనకెంతో ఇష్టమైన పాటగా ఆ ఇంటర్వ్యూలో బాలు పేర్కొన్నారు. స్పష్టమైన తెలుగు మాట్లాడే బాలు అంటే ముఖ్యంగా తెలుగు వారికి ప్రాణం. అందుకే తెలుగు ప్రజానీకం ఆయన మరణవార్తను జీర్ణించుకోలేక పోతోంది.

More News

ఎస్పీబీకి కరోనా పాజిటివ్‌ అని తేలినప్పటి నుంచి మినిట్ టు మినిట్

గాన గంధర్వుడు గాన గంధర్వుడు, లెజెండరీ సింగర్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఇక లేరు.

నిన్న సాయంత్రం నుంచే ఎంజీఎం వద్ద మారిపోయిన పరిస్థితులు

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించిందని గురువారం సాయంత్రం ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

చదువుకుంటూనే పాటలు.. 'మర్యాద రామన్న'తో సినీ ప్రస్థానం

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం శుక్రవారం మధ్యాహ్నం 1:04గంటలకు పరమపదించారు. ఆయన పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం.

లెజెండరీ సింగర్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఇక లేరు

గాన గంధర్వుడు, లెజెండరీ సింగర్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఇక లేరు. కోట్లాది హృదయాల్లో చిచ్చు పెట్టే ఈ వార్తను బాలు కుమారుడు ఎస్పీ చరణ్ వెల్లడించారు.

మా అమ్మా నాన్న సహా అంతా జైలుకెళ్తారు: పరువు హత్యపై అవంతి

హైదరాబాద్‌లో జరిగిన పరువు హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. చందానగర్‌కు చెందిన హేమంత్.. అవంతి అనే యువతిని ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నాడు.