చావంటే తెలియకుండా కన్నుమూయాలి: ఎస్పీబీ
Send us your feedback to audioarticles@vaarta.com
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్లో దాదాపు 40వేల పాటలు పాడారు. ఇంతకంటే ఎవరూ బాగా పాడలేరు అనిపిస్తుంది ఆయన పాట వింటే... అనిపించడం కాదు.. అది అక్షర సత్యం కూడా.. బాలు చిన్నతనంలో ఆయన తండ్రి సాంబమూర్తి... చదువు కావాలా.? పాట కావాలా..? అని ప్రశ్నిస్తే పాటనే ఎంచుకున్నారట.. పాటంటే అంతటి ప్రాణం ఆయనకు. దీంతో ఇంజనీరింగ్‌ను మధ్యలోనే వదిలేసి సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో తన గురించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఆ ఇంటర్వ్యూలో మీ చివరి కోరిక ఏంటి? అన్న ప్రశ్నకు బాలు ఇచ్చిన సమాధానం కన్నీరు తెప్పిస్తుంది. ‘చావంటే తెలియకుండా కన్నుమూయాలి.. ఓపిక ఉన్నంతవరకు పాడుతుండాలి’ అని.. ఇదే తన చివరి కోరికగా పేర్కొన్నారు. ‘శ్రుతిలయలే జననీ జనకులు కాగా..’ అనే పాట తనకెంతో ఇష్టమైన పాటగా ఆ ఇంటర్వ్యూలో బాలు పేర్కొన్నారు. స్పష్టమైన తెలుగు మాట్లాడే బాలు అంటే ముఖ్యంగా తెలుగు వారికి ప్రాణం. అందుకే తెలుగు ప్రజానీకం ఆయన మరణవార్తను జీర్ణించుకోలేక పోతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout