బాలసుబ్రమణ్యంకు చేదు అనుభవం
Send us your feedback to audioarticles@vaarta.com
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల గాంధీజీ 150వ జయంతి సందర్భంగా నిర్వహించిన చేంజ్ విత్ ఇన్ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్స్‌కే పెద్ద పీట వేశారు. దక్షిణాది తారలకు పెద్దగా ఆదరణ దక్కలేదు. తెలుగు సినిమా పరిశ్రమ నుండి దిల్‌రాజు మాత్రమే ఈ వేడుకకి పాల్గొన్నారని తెలిసింది. అయితే అసలు విషయమేమంటే గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యం కూడా ఈ వేడుకకి హాజరయ్యారు. ఈ విషయాన్ని ఆయనే తెలియజేశారు.
``రామోజీరావుగారి చొరవతో ప్రధాని మోడీగారు నిర్వహించిన రిసెప్షన్‌కు హాజరు కాగలిగాను. అందుకు ఆయనకు కృతజ్ఞతలు. అయితే ప్రధాని మోదీ ఇంట ప్రవేశించిన తర్వాత మా సెల్‌ఫోన్స్‌ను భద్రతా సిబ్బంది తీసుకున్నారు. మాకు టోకెన్లు ఇచ్చారు. కానీ లోపలికి వెళ్లాం. తీరా మోదీగారు వచ్చిన తర్వాత స్టార్స్ సెల్ఫీలు తీసుకున్నారు`` అన్నారు బాలసుబ్రమణ్యం. తనకు ఓ రకంగా చేదు అనుభవమే ఎదురైనట్లు బాలసుబ్రమణ్యం పేర్కొన్నారు. ఇప్పటికే దక్షిణాది తారలకు చేంజ్ విత్ ఇన్ కార్యక్రమంలో మోదీ తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని అందరూ గుర్రుగా ఉన్నారు. ఈ తరుణంలో బాలసుబ్రమణ్యం తన అనుభవాన్నికూడా తెలియజేయడం మరింత కారం చెల్లించినట్లు అయ్యింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments