ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకి కరోనా పాజిటివ్..
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జలుబు, జ్వరం తప్ప తన ఆరోగ్యం బాగానే ఉందని ఎవరూ కంగారు పడొద్దని ఓ వీడియో సందేశం ద్వారా అభిమానులకు తెలిపారు.
‘‘నేను రెండు మూడు రోజులుగా కాస్త ఇబ్బందికరంగా ఫీలవుతున్నా. చెస్ట్‌లో ఫ్లమ్ ఫామ్ అవుతోంది. జలుబు, జ్వరంతో బాధపడుతున్నా. ఈ మూడు ఇబ్బందులు తప్ప మరే ప్రాబ్లమ్ లేదు. కానీ నేను దాన్ని ఈజీగా తీసుకోదలుచుకోలేదు. కాబట్టి ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకున్నాను. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మైల్డ్‌గా ఉండటం వలన సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండి వైద్యుల సూచనలను పాటించమని చెప్పారు. కానీ నేను ఇంట్లో ఉంటే నా ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇబ్బందవుతుందని హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాను. నా స్నేహితులంతా ఇక్కడ ఉన్నారు. చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. నేనెలా ఉన్నానోనని ఎవరూ కంగారు పడొద్దు. నేను బాగానే ఉన్నాను’’ అని ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com