ఎస్పీ బాల సుబ్రహ్మణ్యానికి కరోనా నెగిటివ్..
Send us your feedback to audioarticles@vaarta.com
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు, సినీ ఇండస్ట్రీ చేసిన ప్రార్థనలు ఫలించాయి. ఎస్పీ బాలు ఆరోగ్యం క్రమంగా మెరగవుతోందని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తన తండ్రి ఆరోగ్యంపై చరణ్ తాజాగా ఓ ప్రకటనను విడుదల చేశారు.తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఎస్పీ బాలుకి నెగిటివ్ వచ్చిందని చరణ్ తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని మరిన్ని వివరాలు అందిస్తానని అన్నారు. అభిమానులు చేస్తున్న ప్రార్థనలు, అందిస్తున్న మద్దతుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఆగస్ట్ 5వ తేదీన తనకు కరోనా సోకిందని ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని తెలియజేస్తూ ఆయన ఓ వీడియోను ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం విడుదల చేసిన విషయం తెలిసిందే. జలుబు, జ్వరం తప్ప తన ఆరోగ్యం బాగానే ఉందని ఎవరూ కంగారు పడొద్దని సూచించారు. వైద్యులు తనను సెల్ఫ్ క్వారంటైన్లో ఉండమని సూచించారని కానీ తన కుటుంబ సభ్యులకు ఇబ్బంది అవుతుందని తాను ఆసుపత్రిలో చేరినట్టు తెలిపారు. తన స్నేహితులంతా ఆసుపత్రిలోనే ఉన్నారని.. తనను జాగ్రత్తగా చూసుకుంటున్నారని వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments