గాన గంధర్వుడి చివరి పాట ఇదే...
- IndiaGlitz, [Friday,September 25 2020]
గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం సినీ కెరీర్.. 1966లో పద్మనాభం నిర్మించిన ‘మర్యాద రామన్న’ చిత్రంతో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఆయన 40 వేలకు పైగా పాటలను.. విభిన్న భాషల్లో పాడారు. భారతీయ సినీ చరిత్రలోనే ఇది ఇంకెవరికీ సాధ్యం కాలేదంటే అతిశయోక్తి కాదు. ఆయన తండ్రి.. చదువు కావాలా? పాట కావాలా? అని అడిగితే పాటే కావాలని కోరారట. నాటి నుంచే ఆయనకు పాటలంటే అంతటి ప్రేమ. అయితే ఆయన చివరి సారిగా ‘పలాస 1978’ సినిమాలో పాడారు.
‘ఓ సొగసరి’ అంటూ సాగే ఈ పాటను లక్ష్మీ భూపాల రాయగా.. రఘు కుంచె స్వరపరిచారు. బాలు, బేబి కలిసి ఈ పాట పాడారు. ఇదే ఆయన చివరి పాట అయింది. దీనిపై ఆ ‘పలాస 1978’ చిత్ర సంగీత దర్శకుడు, ఆ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించిన రఘు కుంచె మాట్లాడుతూ.. పలాస చిత్రంలో బాలు పాట పాడడం తన అదృష్టమన్నారు. బాలు నుంచి మనం ఎంతో నేర్చుకోవాలని, ఒక గొప్ప గాన గాంధర్వుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.